News July 23, 2024
షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో పార్కింగ్ ఫీజు తీసుకుంటున్నారా?

TG: గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 63 ప్రకారం HYDలోని ప్రతి షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్‌లో మొదటి అరగంట పార్కింగ్ ఉచితం. ఆ తర్వాత ఒక్కో గంట చొప్పున రుసుం వసూలు చేయవచ్చు. అరగంట మించి, అక్కడ ఏదైనా వస్తువు కొనుగోలు చేసిన బిల్లు చూపిస్తే వాహనం ఎంత సేపు ఉన్నా పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు. ఈ నిబంధనలు పక్కాగా అమలవుతున్నాయా? లేదా? అని తెలుసుకునేందుకు అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.
Similar News
News March 30, 2026
ఐదు గ్యారెంటీలతో అస్సాం బరిలో కాంగ్రెస్

ఐదు గ్యారెంటీల మేనిఫెస్టోతో కాంగ్రెస్ అస్సాం ఎన్నికల బరిలోకి దిగింది. మహిళలకు నెలవారీ నగదు బదిలీతో పాటు వ్యాపార విస్తరణకు ₹50వేల సాయం చేస్తాయని ప్రకటించింది. సీనియర్ సిటిజన్లకు నెలకు ₹1,250 చొప్పున పెన్షన్లు, 100 రోజుల్లోనే సింగర్ జుబిన్ గార్గ్ మృతి కేసులో న్యాయం, ₹25లక్షల క్యాష్‌లెస్ హెల్త్ ఇన్సూరెన్స్, 10లక్షల మందికి శాశ్వత భూపట్టాలను ఇప్పిస్తామని హామీ ఇచ్చింది.
News March 30, 2026
US స్థావరాలపై దాడుల్లో ఇరాన్‌కు రష్యా సహకారం: జెలెన్‌స్కీ

సౌదీ అరేబియాలోని US స్థావరాలపై ఇరాన్ చేపట్టిన దాడి వెనుక రష్యా సహకారం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఇరాన్‌కు రష్యా 100% సహకరిస్తోందన్నారు. మార్చి 20, 23, 25 తేదీల్లో సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ శాటిలైట్ చిత్రాలను రష్యా క్యాప్చర్ చేసిందని తెలిపారు. ఒకటి కన్నా ఎక్కువసార్లు అలా శాటిలైట్ ఇమేజెస్‌ను రష్యా సాధారణంగా సేకరించదని పేర్కొన్నారు.
News March 30, 2026
ఏప్రిల్ 20 నుంచి 60% సీట్లకు అదనపు ఛార్జీలు ఉండవు: DGCA

విమానాల్లో ఇకపై 60% సీట్లకు అదనపు ఛార్జీలు ఉండవని డీజీసీఏ వెల్లడించింది. ఏప్రిల్ 20 నుంచి ఇది అమలులోకి రానున్నట్లు తెలిపింది. దీనిపై విమానయాన సంస్థలు పారదర్శకంగా ఉండాలని ఆదేశించింది. కాగా ప్రస్తుతం ఈ ఫ్రీ సీట్ కోటా 20%కు పరిమితమైంది. మిగతా సీట్లకు టికెట్‌కు అదనంగా ₹200 నుంచి ₹2100 వరకు సంస్థలు ఛార్జ్ చేస్తున్నాయి. తాజా ఆదేశాలతో ఛార్జ్ లేకుండా సీట్ ఎంచుకునే వెసులుబాటు పెరుగుతుంది.


