News July 23, 2024
బడ్జెట్‌లో తెలంగాణ పదం నిషేధించారు: సీఎం రేవంత్

TG: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంపై CM రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘TGపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించింది. మాకు నిధులు కేటాయించాలని స్వయంగా నేనే ఢిల్లీ వెళ్లి 3సార్లు PM మోదీకి విన్నవించాను. అనేకసార్లు కేంద్రమంత్రులను కలిశాను. ఇవాళ బడ్జెట్‌లో తెలంగాణ పదం నిషేధించారు. రాష్ట్రం ఊసే ఎత్తడానికి కేంద్రం ఇష్టపడలేదు. మోదీ మనసులో రాష్ట్రంపై కక్ష ఉంది’ అని విమర్శించారు.
Similar News
News March 31, 2026
నేతల ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఇవే..

ఎన్నికల ప్రచారంలో నేతలు అంత ఎనర్జీతో ఎలా ఉంటారో తెలుసా? మోదీ 5 గంటలకే నిద్రలేచి యోగా చేస్తారు. ఆయనకు కిచిడీ అంటే ఇష్టం. రాహుల్ గాంధీ ‘ఐకిడో’ మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్. ప్రొటీన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఇక TN CM స్టాలిన్ సైక్లింగ్‌తో ఫిట్‌గా ఉంటారు. వీళ్లంతా డీహైడ్రేషన్ కాకుండా కొబ్బరినీళ్లు, మజ్జిగపై ఆధారపడతారు. హెల్తీ డైట్, రెగ్యులర్ వాకింగ్ వల్లే వీళ్లు యాక్టివ్‌గా ఉండగలుగుతున్నారు.
News March 31, 2026
జూనియర్ కాలేజీలకు సెలవులే సెలవులు

AP:ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది. ఇందులో 2026-27లో APR-MAR వరకు 314 రోజులకు గాను 232 వర్కింగ్ డేస్‌గా చూపింది. ఇక సండే, 2వ శనివారాలు, పబ్లిక్ హాలిడేస్, పండగలకు 82 రోజులు సెలవుగా పేర్కొంది. OCTలో దసరాతో సహా 14 రోజులు, JANలో సంక్రాంతితో కలిపి 13 రోజులు సెలవు ఇస్తారు. వీటికి అదనంగా ఏటా APR24 నుంచి MAY31 వరకు 38 రోజులు సమ్మర్ సెలవులుంటాయి. మొత్తంగా 120 రోజులు సెలవులే.
News March 31, 2026
రోహిత్ శర్మ ₹214 కోట్ల సామ్రాజ్యం

రోహిత్ శర్మ కేవలం గ్రౌండ్‌లోనే కాదు బయట కూడా ‘హిట్ మ్యాన్’లాగే బతుకుతున్నారు. ₹214 కోట్ల నెట్‌వర్త్ ఉన్న ఈ క్రికెటర్ ముంబైలో లగ్జరీ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అహుజా టవర్స్‌లో ఉన్న ఈ ఇంటి నుంచి సీ-వ్యూ అద్భుతంగా ఉంటుంది. మోడ్రన్ ఇంటీరియర్స్, పీస్‌ఫుల్ గార్డెన్, క్లాసీ పూజా ఏరియాతో ఈ ఇల్లు కలల సౌధాన్ని తలపిస్తుంది. క్రికెట్‌తో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ఆయన రేంజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి.


