News July 23, 2024
దేశంలో మోస్ట్ పాపులర్ సినిమాలివే: IMDb

2024లో ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో మోస్ట్ పాపులర్ సినిమాల లిస్టును IMDb పంచుకుంది. ‘కల్కి 2898AD’ దేశంలోనే టాప్‌లో నిలవగా ఆ తర్వాత మంజుమ్మల్ బాయ్స్, ఫైటర్, హనుమాన్, సైతాన్, లాపతా లేడీస్, ఆర్టికల్ 370, ప్రేమలు, ఆవేశం, ముంజ్య సినిమాలు నిలిచాయి. అలాగే పుష్ప-2, దేవర పార్ట్-1, వెల్కమ్ టు ద జంగిల్ సహా మరికొన్ని సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు IMDb తెలిపింది.
Similar News
News March 27, 2026
‘వారణాసి’ రిలీజ్‌పై ట్విస్ట్.. రెండు పార్టులుగా?

<<19470891>>’వారణాసి’<<>> సినిమా 2 పార్టులుగా విడుదలయ్యే ఛాన్సుందని బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీకి 3hrs+ నిడివి సరిపోదని, రెండు పార్టులుగా రిలీజ్ చేస్తే కథను మరింత బాగా చెప్పొచ్చని మూవీ టీమ్ భావిస్తున్నట్లు తెలిపాయి. రెండో పార్ట్ సీక్వెల్‌లా కాకుండా కొనసాగింపుగా ఉంటుందని సమాచారం. అయితే ఈ మూవీని ఒకే పార్ట్‌గా రిలీజ్ చేస్తామని గతంలో రాజమౌళి ప్రకటించినా లేటెస్ట్ బజ్‌పై అఫీషియల్‌గా క్లారిటీ రావాల్సి ఉంది.
News March 27, 2026
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు

పెట్రోల్, డీజిల్‌పై అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. పెట్రోల్‌పై గతంలో రూ.13 ఉంటే రూ.3కు, డీజిల్‌పై రూ.10 ఉంటే ఇప్పుడు సున్నాకు తగ్గించినట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గే అవకాశం ఉంది. HPCL, IOCL, BPCL షేర్లు భారీగా లాభపడనున్నాయి.
News March 27, 2026
42వేల టన్నుల LPG.. మరో నౌక వచ్చేసింది

హార్ముజ్ జలసంధిని దాటుకొని మరో నౌక భారత్‌కు చేరుకుంది. కాసేపటి క్రితం గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు చేరుకున్న ‘జగ్ వసంత్’ షిప్పులో 42వేల టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) ఉంది. మరోవైపు 45వేల టన్నుల LPGతో ‘పైన్ గ్యాస్’ అనే నౌక సైతం ఇవాళ లేదా రేపు ఇండియాకు చేరనుంది. హార్ముజ్ దాటాక భారత నేవీ ఈ షిప్పులకు ఎస్కార్ట్ కల్పించింది.


