News July 23, 2024
కేంద్రం గుడ్‌న్యూస్.. పిల్లలకు పెన్షన్ స్కీమ్

నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS)లో కేంద్రం మార్పులు చేసింది. పెన్షన్ పథకంలో మైనర్లను చేరుస్తూ ‘NPS-వాత్సల్య’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా పేరెంట్స్, సంరక్షకులు పిల్లల పేరిట డబ్బులు జమ చేయొచ్చు. వారు మేజర్ అయ్యాక అది అటోమేటిక్‌గా రెగ్యులర్ NPS అకౌంట్‌గా మారుతుంది. పిల్లలకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను అందించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు FM నిర్మలా సీతారామన్ తెలిపారు.
Similar News
News April 6, 2026
భర్తను కాదని నచ్చిన వాడితో ఉండేందుకు అనుమతించిన కోర్టు

పెళ్లయిన 19 ఏళ్ల మహిళ తన భర్త, తల్లిదండ్రులతో ఉండటానికి నిరాకరించిన కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 40 ఏళ్ల భర్త నుంచి విడిపోయి, తనకిష్టమైన భాగస్వామితో ఉంటానన్న ఆమె నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. మేజర్ అయిన వ్యక్తికి తన ఇష్టప్రకారం జీవించే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. కౌన్సెలింగ్ ఇచ్చినా, ఫ్యామిలీ ఒత్తిడి చేసినా సదరు మహిళ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడం గమనార్హం.
News April 6, 2026
ఇవాళ లేదా రేపు అమరావతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం!

AP: అమరావతి చట్టబద్ధత బిల్లు కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్రపతి భవన్‌కు చేరింది. ఇవాళ లేదా రేపు ప్రెసిడెంట్ దానికి ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. న్యాయనిపుణులతో పరిశీలన అనంతరం ఆమోదం తెలపనున్నారు. దీంతో ఆ బిల్లు చట్టంగా మారనుంది. ఆ తర్వాత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
News April 6, 2026
కాంగ్రెస్ పాకిస్థాన్ పాట పాడుతోంది: మోదీ

కాంగ్రెస్ చర్యలు పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉన్నాయని, జాతీయ భద్రతకు అది ప్రమాదమని ప్రధాని మోదీ అన్నారు. ‘ఆ పార్టీ ఎల్లప్పుడూ పాక్ పల్లవినే అందుకుంటుంది. దాన్ని మేం ఎప్పటికీ అనుమతించబోం’ అని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కాంగ్రెస్ వైఖరిని ఆయన తప్పుబట్టారు. చొరబాటుదారులను బాధితులుగా చూపాలని ఆ పార్టీ ప్రయత్నించిందని అస్సాంలోని బార్పేట సభలో ఫైరయ్యారు.


