News July 23, 2024
కనిగిరి ఘటన నన్ను కలిచి వేసింది: గొట్టిపాటి

కనిగిరి మండలం పునుగోడులో విద్యుత్ షాక్‌తో ముగ్గురు యువకులు మృతి చెందడం పట్ల విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో యువకులు చనిపోవడం తనను కలచివేసిందని పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నష్ట పరిహారం చెల్లిస్తామని, అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు.
Similar News
News January 11, 2026
వెల్లంపల్లి హైవేపై ప్రమాదం..ఒకరి స్పాట్ డెడ్

త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రాంబాబు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు వెల్లంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News January 11, 2026
ప్రకాశం: హైవేపై ప్రమాదం.. ఒకరు దుర్మరణం

లారీని కారు వేగంగా ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రాచర్ల మండలం ఎడవల్లి గ్రామం వద్ద అమరావతి- అనంతపురం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను గిద్దలూరు వైద్యశాలకు తరలించగా ఒకరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News January 10, 2026
ప్రకాశం: ‘సంప్రదాయ క్రీడలను నిర్వహించాలి’

కోడి పందేలు, జూదాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయ క్రీడలను నిర్వహించాలన్నారు. ఎక్కడైనా కోడిపందేలు నిర్వహిస్తే 112 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే 9121102266 వాట్సాప్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.


