News July 23, 2024
BUDGET.. వారికి జీరో ట్యాక్స్

కొత్త పన్ను విధానం ఎంచుకునే వారికి గతంలో రూ.7లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సి ఉండేది కాదు. సెక్షన్ 87A కింద రూ.25వేలు రిబేట్ లభిస్తుంది. స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.50వేలు కలిపి ₹7.50 లక్షల వరకు పన్ను కట్టే పనిలేదు. తాజా బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ ₹75వేలకు పెంచారు. రిబేట్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో రూ.7.75 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
Similar News
News April 1, 2026
అమరావతి బిల్లుపై చర్చకు YCP

పార్లమెంటులో ఇవాళ ప్రవేశపెట్టే రాజధాని అమరావతి బిల్లుపై చర్చలో వైసీపీ పాల్గొననుంది. ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను టీడీపీ ఎంపీలు కలిశారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చర్చకు ఉంటుందని ఎంపీలతో స్పీకర్ చెప్పారు.
News April 1, 2026
రాష్ట్రంలో 14,553 పోలీస్ ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. కొత్తగా సంస్థాన్ నారాయణపూర్, ఆమన్‌గల్‌లో స్పెషల్ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు కానున్నాయి. వీటికి అవసరమైన సిబ్బందితో పాటు వివిధ విభాగాల్లో మొత్తం 14,553 కానిస్టేబుళ్లు, ఎస్సైల కోసం పోలీస్ శాఖ రిక్రూట్‌మెంట్ చేపట్టనుంది. ఇందుకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది.
News April 1, 2026
SBI అకౌంట్ వాడుతున్నారా.. కాసేపట్లో..

ఖాతాదారులకు SBI బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ ఉదయం 11.00 గంటల నుంచి 11.45 గంటల వరకు UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS సేవలు పనిచేయవని పేర్కొంది. మెయింటెనెన్స్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుందని తెలిపింది. ఖాతాదారులు UPI Lite, ATM ద్వారా సేవలు పొందొచ్చని, అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించింది.


