News July 24, 2024

ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన గుంటూరు కలెక్టర్‌

image

ఫిరంగిపురం, రేపూడి గ్రామ మార్కెట్ యార్డులో ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్‌ను రెవెన్యూ డివిజన్ అధికారితో కలిసి, కలెక్టర్‌
నాగలక్ష్మి మంగళవారం తనిఖీ చేశారు. ఎన్నికల సమయంలో డిఫెక్టివ్ వీవీప్యాట్లను గోడౌన్ నుంచి బెంగళూరు బెల్ కంపెనీకి రిపేర్ నిమిత్తం ప్రత్యేక భద్రతతో తరలించారు. రాజకీయ పార్టీల నాయకులు, ఫిరంగిపురం తహశీల్దార్ రాఘవేంద్రరావు, అన్ని నియోజక వర్గాల ఎలెక్షన్ డిప్యూటీ తహశీల్దార్‌లు పాల్గొన్నారు.

Similar News

News September 13, 2025

గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్

image

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా వకుల్ జిందాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న సతీష్ కుమార్‌ను సత్యసాయి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. 2016 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో బాపట్ల ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం విజయనగరం జిల్లా నుంచి బదిలీపై గుంటూరుకు వస్తున్నారు. అక్కడ మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన, రోడ్డు ప్రమాదాల నివారణ, విద్యార్థులు, మహిళలకు రక్షణ వంటి చర్యలు విస్తృతంగా చేపట్టారు.

News September 13, 2025

పెదనందిపాడు: పిడుగుపాటుకు ఇద్దరు మహిళల మృతి

image

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామం సమీపంలో శనివారం విషాద ఘటన జరిగింది. అన్నపర్రు నుంచి కొప్పర్రు వెళ్ళే రహదారి పక్కన చేపల చెరువు దగ్గర పొలం పనులు ముగించుకుని వస్తుండగా పిడుగుపాటు సంభవించి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అన్నపర్రు గ్రామానికి చెందిన దేవరపల్లి సామ్రాజ్యం (రజిక), తన్నీరు నాగమ్మ (వడ్డెర)గా గుర్తించారు.

News September 13, 2025

నేడు గుంటూరు కలెక్టర్ బాధ్యతలు

image

గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులైన తమీమ్ అన్సారీయా శనివారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన IAS బదిలీల్లో ఈమె ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ నేడు గుంటూరుకు రానున్నారు. ఇటీవలే జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. జిల్లాకు నూతన కలెక్టర్, జేసీల కాంబినేషన్‌లో పాలన కొనసాగనుంది. 38 ఏళ్లలో జిల్లాకు మూడో మైనారిటీ వర్గానికి చెందిన కలెక్టర్.