News July 24, 2024
నెల్లూరు: ఫలితాల కోసం వీఎస్‌యూ విద్యార్థుల ఎదురుచూపులు

విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలోని విద్యార్థులు 4వ సెమిస్టర్ పరీక్షలు రాసి 3 నెలలు అవుతుంది. వచ్చే నెల 22వ తేదీన ఐసెట్ కౌన్సిలింగ్ చివరి తేదీ. అయినప్పటికీ ఇంకా 4వ సెమిస్టర్ రిజల్ట్స్ రాకపోవడంతో.. విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షా ఫలితాలు ఆలస్యం కావడంతో విద్యార్థులు యూనివర్సిటీ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 18, 2026
నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు బదిలీ..!

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసఫ్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈయన అల్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. అప్పటి వరకు ఇక్కడ ప్రకాశం జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఇన్‌ఛార్జ్‌గా కొనసాగనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో రవి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
News February 18, 2026
నెల్లూరు: రంజాన్.. 31 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి.!

31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో రంజాన్ మాసం రావడం విశేషం. నేటి(బుధవారం) రాత్రి చంద్ర దర్శనంతో ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ నెల ప్రారంభమవుతుంది. గురువారం తెల్లవారుజాము నుంచి ముస్లింలు తమ ఉపవాస దీక్షలను ప్రారంభించనున్నారు. ఈ నెలలో సేవలు, దానధర్మాలు చేస్తే పుణ్యకార్యంగా భావిస్తారు. మార్చి 19 లేదా 20 తేదిలలో ఉపవాస దీక్షలు ముగుస్తాయి. ఆరోజు ఈద్ ఉల్ ఫితర్‌ను చేసుకోనున్నారు.
News February 18, 2026
5,35,499 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ: DMHO

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 1-19 సం.లలోపు ఉన్న 5.75,806 పిల్లలలో 5,35,499 మందికి ఆల్బెండజోల్ మాత్రలు మింగించినట్లు DMHO డాక్టర్ వి.సుజాత తెలిపారు. మొత్తంగా 93% ప్రగతి సాధించినట్లు తెలిపారు. మిగిలిన వారికి ఈనెల 24వ తేదీన ఇవ్వనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.


