News July 24, 2024

జగన్ కేసుపై రోజువారీ విచారణ చేపట్టండి: హైకోర్టు

image

AP: వైఎస్ జగన్ ఆస్తులకు సంబంధించి నమోదైన కేసులపై రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు మరోసారి సీబీఐ కోర్టుకు స్పష్టం చేసింది. ఈనెల 3న ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను సత్వరం పూర్తి చేయాలన్న మాజీ మంత్రి హరిరామజోగయ్య పిటిషన్‌పై ఈ మేరకు ధర్మాసనం స్పందించింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.

Similar News

News February 4, 2026

వరిలో రెల్లరాల్చు పురుగును ఎలా నివారించాలి?

image

వరి పంటను రెల్లరాల్చు పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. ఈ పురుగు లార్వాలు గింజ గట్టిపడే దశలో కంకులను కత్తిరిస్తాయి. దీని వల్ల కంకులు రాలిపోతాయి. ఈ పురుగులు పగలు భూమిలో దాక్కొని రాత్రి వేళల్లో పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఈ పురుగుల ఉద్ధృతి తక్కువగా ఉంటే లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ.. ఉద్ధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి క్లోరంట్రనిలిప్రోల్ 0.3ml కలిపి సాయంత్రం వేళ పిచికారీ చేయాలి.

News February 4, 2026

BELలో 99 పోస్టులు.. అప్లై చేశారా?

image

చెన్నైలోని BEL 99 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. BE/BTech, BCom, BBA, BBM, డిప్లొమా, ITI అర్హత గలవారు ముందుగా NATS/NAPS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ITI, డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు FEB 5న, BE/BTech అభ్యర్థులకు FEB 6, 7తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. అప్రెంటిస్‌గా ఏడాది పూర్తి చేసుకున్నవారికి పరీక్ష నిర్వహించి ట్రైనీ Engg., అడ్వాన్స్‌డ్ ట్రైనీస్‌గా నియమించుకుంటారు.

News February 4, 2026

సృజనాత్మకతకు నిలయం ‘స్వాధిష్టాన చక్రం’

image

నాభికి కింద ఉండే ఈ చక్రం సృజనాత్మకతకు, భావోద్వేగాలకు నిలయం. ఇది సరిగ్గా ఉంటేనే సంతోషం, కొత్త విషయాలను సృష్టించే శక్తి, చక్కని బాంధవ్యాలు ఉంటాయి. అస్థిరత ఏర్పడితే లైంగిక సమస్యలు, కోపం, మూత్రపిండాల వ్యాధులు వచ్చే ఛాన్సుంది. దీనిని ఉత్తేజితం చేయడానికి ‘వం’ మంత్రాన్ని పఠించాలి. నారింజ రంగు ఆహార పదార్థాలు తీసుకోవాలి. నీటితో సాన్నిహిత్యం(ఈత కొట్టడం, స్నానం) పెంచుకోవడం వల్ల ఈ చక్రం సమతుల్యం అవుతుంది.