News July 24, 2024

విశాఖ: నవోదయలో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

కొమ్మాదిలోని జవహర్ నవోదయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. సెప్టెంబర్ 16వ తేదీలోగా www.navodaya.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. 2003 మే 1 నుంచి 2017 జులై 31 మధ్య జన్మించిన వారు అర్హులు. 2025 జనవరి 18న ఉదయం 11:30 నుంచి 1:30 వరకు పరీక్ష నిర్వహిస్తారు. 75 శాతం గ్రామీణ విద్యార్థులకు, 25 శాతం పట్టణ విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. > Share it

Similar News

News September 24, 2025

గాజువాక: డాక్‌యార్డ్ వంతెన రెఢీ

image

గాజువాక పారిశ్రామిక ప్రాంత వాసుల రవాణా కష్టాలు తీరనున్నాయి. డాక్‌యార్డ్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెన నిర్మాణం పూర్తయ్యింది. పోర్ట్ యాజమాన్యం మద్రాస్ ఐఐటి ఇంజనీర్ల బృందంతో రూ.26 కోట్లతో 330 మీ.పొడవు.10.5మీ.వెడల్పు 20 నెలల్లో వంతెన పునర్నిర్మాణం పూర్తిచేశారు. దసరా నుంచి రాకపోకలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలా అయితే ప్రయాణికులకు సమయంతోపాటు ఖర్చూ తగ్గుతుంది.

News September 24, 2025

అసెంబ్లీ సమావేశాలు ముగియగానే సమస్యకు పరిష్కారం: వంశీకృష్ణ

image

విశాఖలో తొలగించిన స్ట్రీట్ వెండర్స్, ఫుడ్ కోర్ట్ వర్తకుల వ్యాపారాలను తిరిగి ఏర్పాటు చేయిస్తానని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ బుధవారం హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే వారి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. వెండర్ కార్డులు ఇచ్చి చట్టబద్ధంగా వ్యాపారాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చిరువర్తులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

News September 24, 2025

కార్పొరేటర్లు టూర్‌లో.. మేము బతుకు కోసం పోరులో!

image

విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్-2.0’ పేరుతో GVMC ఆక్రమణలను తొలగిస్తున్న విషయం తెలిసిందే. దీంతో తమ ఉపాధి కోల్పోయామంటూ చిరు వ్యాపారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. తమ కష్టాలను తీరుస్తారని గెలిపించిన కార్పొరేటర్లు మాత్రం ఈ కష్ట సమయంలో తమను గాలికొదిలేసి విహార యాత్రలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకుందామంటే ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని వాపోయారు.