News July 24, 2024

నల్గొండ: ఎంజీయూలో మూడు రోజులు శిక్షణ

image

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం జియాలజీ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా భూగర్భ జలాల మూలాలు సుస్థిరత, నిర్వహణపై విద్యార్థులకు ఈనెల 24 నుంచి 26 వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థులందరు హజరు కావాలని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ శాస్త్రవేత్త విఠల్, జియాలజీ విభాధిపతి మధుసూదన్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Similar News

News February 18, 2026

NLG: రేపటి వరకు రేషన్ బియ్యం పంపిణీ

image

రేషన్ బియ్యం ఈ నెల 19వ తేదీ వరకు సరఫరా చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాసన రఘునందన్ తెలిపారు. ఇప్పటివరకు రేషన్ తీసుకోని లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏదైనా కారణాలతో రేషన్ తీసుకోని వారికి అవకాశం ఉందని తెలిపారు.

News February 18, 2026

నల్గొండ: ఇంటర్ పరీక్షలకు సిద్ధం

image

నల్గొండ జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల కోసం విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 45 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేయగా, మొత్తం 27,018 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.

News February 18, 2026

నల్గొండ: భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షిస్తూ, రైతుల సమస్యలను పరిష్కరించి త్వరగా భూసేకరణ ప్రక్రియ ముగించాలని స్పష్టం చేశారు.