News July 24, 2024
VD12లో విజయ్ దేవరకొండ లుక్ లీక్

గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న VD12 సినిమాలోని రౌడీబాయ్ విజయ్ దేవరకొండ లుక్ లీక్ అయింది. బీచ్ ఒడ్డున జరిగిన షూటింగ్‌లో విజయ్ బైక్‌పై కూర్చున్న ఫొటో నెట్టింట ప్రత్యక్షమైంది. షార్ట్ హెయిర్‌తో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో VD అదిరిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుగుతుండగా విజయ్ పాత్రకు సంబంధించిన సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అక్కడున్నవారు ఫొటో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో వైరలవుతోంది.
Similar News
News April 3, 2026
ముగిసిన టెన్త్ పరీక్షలు.. 6 నుంచి వాల్యుయేషన్

AP: మార్చి 16వ తేదీన మొదలైన టెన్త్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. అన్ని ప్రధాన సబ్జెక్టుల్లో 99.05% అటెండెన్స్ నమోదైంది. 3,415 ఎగ్జామ్ సెంటర్లలో 6,22,152 మంది రెగ్యులర్.. 19,568 మంది ప్రైవేట్ అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పేపర్ల వాల్యుయేషన్ జరగనుంది. ఈ నెల నాలుగో వారంలో రిజల్ట్స్ వచ్చే అవకాశముంది.
News April 3, 2026
చెపాక్‌లో చెన్నై బోణీ కొడుతుందా?

IPL: తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదుర్కొన్న CSK ఈరోజు తన రెండో మ్యాచ్ PBKSతో ఆడనుంది. సొంతగడ్డ అయిన చెపాక్ స్టేడియంలో పంజాబ్‌ను ఓడించి బోణీ కొట్టాలని సీఎస్‌కే ఆశిస్తోంది. మరోవైపు GTపై విక్టరీతో ఉత్సాహంగా ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. ఇరు జట్లు ఇప్పటివరకు 32సార్లు తలపడగా చెరో 16 విజయాలతో సమానంగా ఉన్నాయి. ఈరోజు రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.
News April 3, 2026
ఎలాంటి వారికి దూరంగా ఉండాలి?

వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును
చీడపురుగు చేరి చెట్టు చెఱచు
కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ మహా వృక్షాన్ని వేరు పురుగు నాశనం చేయగలదు. ఓ చెట్టును చీడ పురుగు చంపేయగలదు. అలాగే దుర్మార్గుడు కూడా మంచివారిని చెడగొట్టే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలి.
<<-se>>#PADHYAM<<>>


