News July 24, 2024

ప్రభుత్వానికి రూ.26,000 కోట్ల లాస్: CBDT ఛైర్మన్

image

పన్ను స్లాబులు సవరించడం వల్ల మిడిల్ క్లాస్ ప్రజలు రూ.17500 వరకు ఆదా చేసుకోవచ్చని CBDT ఛైర్మన్ రవి అగర్వాల్ అన్నారు. ‘తక్కువ పన్ను స్లాబుల పరిధిని రూ.3-7 లక్షలు, రూ.7-10 లక్షలకు పెంచారు. బెనిఫిట్ వల్లే ట్యాక్స్ పేయర్లలో 65% కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50000-రూ.75000కు పెంచడంతో ప్రభుత్వం ప్రత్యక్ష పన్నుల్లో రూ.29000 కోట్లు వదులుకోవాల్సి వస్తోంది’ అని చెప్పారు.

Similar News

News April 3, 2026

ECIL, హైదరాబాద్‌లో 32 ఉద్యోగాలు

image

కాంట్రాక్ట్ ప్రాతిపదికన 32 పోస్టుల భర్తీకి ECIL, హైదరాబాద్‌.. దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటిలో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌-14, టెక్నికల్‌ ఆఫీసర్‌-8, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌-3, సీనియర్‌ ఆర్టీజన్‌-7 ఉన్నాయి. సంబంధిత ట్రేడ్‌లో ITI/డిప్లొమా/BE/బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేయొచ్చు. వయసు 30-33 మధ్య ఉండాలి. APR- 9,18న ఇంటర్వ్యూ ఉంటుంది. పూర్తి వివరాలకు www.ecil.co.in చూడండి.

News April 3, 2026

ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగండి: సోనూసూద్

image

ప్రస్తుతం జరుగుతున్న భారీ <<19527926>>లేఆఫ్స్‌పై<<>> నటుడు సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవడం బాధాకరమని, సంక్షోభం నుంచే రేపటి పారిశ్రామికవేత్తలు పుట్టుకొస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ఉద్యోగం కోసం వెతకడమే కాకుండా భవిష్యత్తులో కంపెనీలను స్థాపించే దిశగా ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. కష్టాలను అధిగమించి విజేతలుగా ఎదగాలని యువతకు సూచించారు.

News April 3, 2026

ICMR-NIIRND, రాజస్థాన్‌‌లో ఉద్యోగాలు

image

ICMR-NIIRND, రాజస్థాన్‌.. తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-1, ప్రాజెక్ట్‌ నర్సు-2, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-3 పోస్టులు ఉన్నాయి. నర్సింగ్ లేదా పీజీతో పాటు పని అనుభవం ఉన్నవారు అప్లై చేయొచ్చు. వయసు 30-40 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వూ తేదీ- APR-9. పూర్తి వివరాలకు www.icmr.gov.in చూడండి.