News July 24, 2024

LBSNAAకు వెళ్లని ఖేడ్కర్

image

మహారాష్ట్రకు చెందిన ట్రైనీ ఐఏఎస్ <<13661085>>పూజా ఖేడ్కర్‌<<>> UPSC ఆదేశాలను బేఖాతరు చేశారు. శిక్షణను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఈనెల 23లోగా లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA)లో రిపోర్ట్ చేయాలని UPSC ఆదేశించింది. గడువు ముగిసినా ఆమె అకాడమీలో రిపోర్ట్ చేయలేదు. అయితే వ్యక్తిగత కారణాల దృష్ట్యా తాను రావట్లేదని ఆమె ఇన్ఫార్మ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై UPSC ఎలా స్పందిస్తుందో చూడాలి.

Similar News

News September 18, 2025

RTCలో డ్రైవర్ పోస్టులు.. అర్హతలు ఇవే

image

TGSRTCలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైన సంగతి తెలిసిందే. డ్రైవర్ పోస్టులకు వయో పరిమితి 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లుగా నిర్ణయించారు. కనీస విద్యార్హత పదో తరగతి పాసై ఉండాలి. పేస్కేల్ రూ.20,960-60,080గా ఉంటుంది. హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ (HGV) లేదా ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 18, 2025

HEALTH: ఇవి పాటిస్తే రోగాలు దూరం!

image

* ఆరోగ్యకరమైన కిడ్నీల కోసం పుష్కలంగా నీరు తాగండి
* గుండె ఆరోగ్యం కోసం అధికంగా ఉప్పు తినకూడదు
* పొగ తాగకుండా ఉంటే మీ ఊపిరితిత్తులు సేఫ్
* రోజూ 8 గంటలు నిద్రపోతే మెదడు ఆరోగ్యంగా ఉండి చురుగ్గా పనిచేస్తుంది
* పొట్ట ఆరోగ్యం కోసం ఐస్‌క్రీమ్స్, చల్లని పదార్థాలు తినడం మానేయాలి
* మూత్రనాళం ఆరోగ్యానికి పచ్చి ఉల్లిపాయలు మంచివని వైద్యులు చెబుతున్నారు.

News September 18, 2025

27 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

image

ఐఐటీ ఢిల్లీలో 4 ప్రాజెక్ట్ సైంటిస్టు పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఈ నెల 30 ఆఖరు తేదీ. ఐఐటీ హైదరాబాద్‌లో 4 రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు ఈనెల 26 వరకు, మునిషన్స్ ఇండియా లిమిటెడ్‌లో 14 ఇంజినీర్ పోస్టులకు ఈ నెల 28వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్‌లో 5 ఉద్యోగాలకు అక్టోబర్ 3 వరకు అవకాశం ఉంది.