News July 24, 2024
విశాఖ: ‘ఆల్ ది బెస్ట్ జ్యోతి’

విశాఖ నగరానికి చెందిన ఎర్రాజీ జ్యోతి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. పారిస్‌లో రేపటి నుంచి జరిగే ఒలింపిక్ క్రీడల్లో ఆమె పాల్గొననుంది. 100 మీటర్ల హార్డిల్స్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఒలింపిక్స్‌కు విశాఖ అమ్మాయి అర్హత సాధించడం పట్ల పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పతకంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
Similar News
News September 24, 2025
గాజువాక: డాక్‌యార్డ్ వంతెన రెఢీ

గాజువాక పారిశ్రామిక ప్రాంత వాసుల రవాణా కష్టాలు తీరనున్నాయి. డాక్‌యార్డ్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెన నిర్మాణం పూర్తయ్యింది. పోర్ట్ యాజమాన్యం మద్రాస్ ఐఐటి ఇంజనీర్ల బృందంతో రూ.26 కోట్లతో 330 మీ.పొడవు.10.5మీ.వెడల్పు 20 నెలల్లో వంతెన పునర్నిర్మాణం పూర్తిచేశారు. దసరా నుంచి రాకపోకలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలా అయితే ప్రయాణికులకు సమయంతోపాటు ఖర్చూ తగ్గుతుంది.
News September 24, 2025
అసెంబ్లీ సమావేశాలు ముగియగానే సమస్యకు పరిష్కారం: వంశీకృష్ణ

విశాఖలో తొలగించిన స్ట్రీట్ వెండర్స్, ఫుడ్ కోర్ట్ వర్తకుల వ్యాపారాలను తిరిగి ఏర్పాటు చేయిస్తానని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ బుధవారం హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే వారి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. వెండర్ కార్డులు ఇచ్చి చట్టబద్ధంగా వ్యాపారాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చిరువర్తులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
News September 24, 2025
కార్పొరేటర్లు టూర్‌లో.. మేము బతుకు కోసం పోరులో!

విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్-2.0’ పేరుతో GVMC ఆక్రమణలను తొలగిస్తున్న విషయం తెలిసిందే. దీంతో తమ ఉపాధి కోల్పోయామంటూ చిరు వ్యాపారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. తమ కష్టాలను తీరుస్తారని గెలిపించిన కార్పొరేటర్లు మాత్రం ఈ కష్ట సమయంలో తమను గాలికొదిలేసి విహార యాత్రలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకుందామంటే ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని వాపోయారు.