News July 24, 2024
ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌ను ప్రక్షాళన చేస్తాం: CBN

AP: దేశ చరిత్రలో ఎప్పుడూ జరగనంత అవినీతి ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ద్వారా వైసీపీ నేతలు చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ‘కొత్త మద్యం పాలసీ తీసుకురావాల్సి ఉంది. మద్యం రేట్లను పేదలకు అందుబాటులోకి తీసుకొస్తాం. డీఅడిక్షన్, రీహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. మరోసారి ఇలాంటి అవినీతి చేయాలంటే భయపడేలా వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం’ అని ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు చెప్పారు.
Similar News
News January 17, 2026
సార్.. జాబ్ క్యాలెండర్ ప్లీజ్: నిరుద్యోగులు

AP: ఇచ్చిన మాట ప్రకారం ఈ నెలలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ గతంలో <<18617902>>ప్రకటించిన<<>> విషయాన్ని గుర్తుచేస్తున్నారు. 25వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటూ Xలో పోస్టులు పెడుతున్నారు. ఉద్యోగాల కోసం లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అంటున్నారు.
News January 17, 2026
ఏపీ నుంచి వచ్చే వాహనాల దారి మళ్లింపు

సంక్రాంతి సెలవులు ముగియడంతో AP నుంచి HYDకు వాహనాల రద్దీ పెరిగింది. NH-65 విస్తరణ పనుల దృష్ట్యా అధికారులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. గుంటూరు నుంచి HYD వచ్చే వెహికల్స్‌ను మిర్యాలగూడ-హాలియా-చింతపల్లి-మాల్, మాచర్ల-సాగర్-పెద్దవూర-చింతపల్లి-మాల్ మీదుగా, విజయవాడ నుంచి వచ్చే వాటిని కోదాడ-మాల్ నుంచి HYDకు పంపిస్తున్నారు. NH-65పై ట్రాఫిక్ జామ్ ఏర్పడితే చిట్యాల నుంచి భువనగిరి మీదుగా దారి మళ్లించనున్నారు.
News January 17, 2026
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<


