News July 24, 2024

టెస్టుల్లో ఒక్కరోజులో 600 పరుగులు చేస్తాం: ఓలీ పోప్

image

టెస్టుల్లో ఇంగ్లండ్ త్వరలోనే ఒక్క రోజులోనే 600 పరుగులు చేస్తుందని ఆ జట్టు ప్లేయర్ ఓలీ పోప్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ENG బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా ఉందని చెప్పారు. మరోవైపు తాము కొన్నిసార్లు ఒక్క రోజులో 280-300 పరుగులు చేయొచ్చని అన్నారు. పరిస్థితులను అర్థం చేసుకుంటున్నట్లు తెలిపారు. కాగా టెస్టుల్లో ఒక్క రోజులో అత్యధిక పరుగుల(588/6) రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 1936లో భారత్‌పై ఈ ఘనత అందుకుంది.

Similar News

News January 8, 2026

YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

image

AP: రాజధాని అంశం రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది. అమరావతిపై <<18799615>>జగన్<<>> చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందనే చర్చ మొదలైంది. గతంలో తీసుకొచ్చిన 3 రాజధానుల ప్రతిపాదనను ఈసారి అమలు చేస్తారనే టాక్ విన్పిస్తోంది. మరోవైపు అమరావతికి చట్టబద్ధత తెస్తామని ప్రభుత్వం చెబుతోంది. కాగా ప్రభుత్వం మారితే APకి రాజధాని మారుతుందా?, శాశ్వత క్యాపిటల్ ఉండదా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

News January 8, 2026

సర్ఫరాజ్ రికార్డు.. 15 బాల్స్‌లో 50

image

ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ VHTలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశారు. పంజాబ్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆయన 15బాల్స్‌లో 50 రన్స్ చేసి చరిత్ర సృష్టించారు. దూకుడుగా ఆడిన సర్ఫరాజ్ (62) అభిషేక్ శర్మ వేసిన ఒకే ఓవర్‌లో 6, 4, 6, 4, 6, 4 బాది 30 పరుగులు చేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో ముంబై ఓడింది. ఇంతకుముందు ఈ రికార్డు బరోడా బ్యాటర్ అతీత్ శేఠ్ (16 బాల్స్‌లో 50) పేరున ఉంది.

News January 8, 2026

త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ: CM

image

TG: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తరహాలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురానున్నట్లు CM రేవంత్ తెలిపారు. సచివాలయంలో CMతో హిమాచల్‌ప్రదేశ్ మంత్రి రోహిత్ కుమార్ భేటీ అయ్యారు. ‘అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే చోట రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్య అందిస్తాం. చిన్నారులను స్కూళ్లకు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యాన్ని కల్పించే అంశంపై యోచిస్తున్నాం’ అని CM వివరించారు.