News July 24, 2024
ALERT: రేపు భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వానలు పడతాయని పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, ములుగు, వరంగల్, హన్మకొండ జనగాం, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
Similar News
News January 1, 2026
5-10 శాతం పెరగనున్న AC, రిఫ్రిజిరేటర్ల ధరలు

బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ప్రభావంతో AC, రిఫ్రిజిరేటర్ల ధరలు 5-10% వరకు పెరగనున్నాయి. BEE కొత్త నిబంధనల ప్రకారం 5-స్టార్ ACలు 10% ఎక్కువ ఎనర్జీ ఎఫిషియంట్‌గా ఉండాలి. ఇందుకోసం ఖరీదైన భాగాలు ఉపయోగించాల్సి రావడంతో పాటు రూపాయి విలువ పతనం, కాపర్ ధరల పెరుగుదల కూడా కారణాలుగా కంపెనీలు చెబుతున్నాయి.
News January 1, 2026
394 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

IOCLలో 394 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు JAN 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి B.Tech, BE, BSc, ఇంటర్, డిప్లొమా, ITI ఉత్తీర్ణులై, వయసు 18 – 26 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. CBT, ఫిజికల్ టెస్ట్/స్కిల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iocl.com *మరిన్ని ఉద్యోగాలకు <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News January 1, 2026
కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే?

కొందరిలో కనుబొమ్మలు చాలా పలుచగా ఉంటాయి. వాటిని పెంచడానికి ఈ టిప్స్..* కనుబొమ్మలపై రోజూ ఆముదం నూనెను రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. * తాజా కలబంద జెల్ ను కనుబొమ్మలపై రాసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. * కొబ్బరి నూనెలో రోజ్‌మేరీ నూనెను కలిపి కనుబొమ్మలపై మర్దనా చేస్తే ఒత్తుగా పెరుగుతాయి.


