News July 24, 2024
అధికార యంత్రంగం సమష్టిగా పనిచేయాలి: కలెక్టర్ నాగలక్ష్మి

రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు అధికార యంత్రాంగం సమష్టిగా పనిచేయాలని కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్‌గా భార్గవ్ తేజ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన కలెక్టర్‌ను కలిసి పుప్పగుచ్ఛం అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రెవెన్యూ, పౌరసరఫరాల వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేలా కృషి చేయాలని చెప్పారు.
Similar News
News September 17, 2025
తాడేపల్లి: తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

ఈనెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని టీటీడీ ఆహ్వానించింది. బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. పండితులు సీఎంను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
News September 17, 2025
తురకపాలెంలో జిల్లా కలెక్టర్ పర్యటన

గుంటూరు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా బుధవారం తురకపాలెంలో పర్యటించి తాగునీరు, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్థులు కాచి చల్లార్చిన నీటినే తాగాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. జూన్, జులై నెలల్లో ఎదురయ్యే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కలెక్టర్‌ను కోరారు.
News September 17, 2025
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్‌గా ప్రొఫెసర్ రత్న షీలామణి

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టార్, ఆంగ్ల విభాగ ఆచార్యులు ప్రొఫెసర్ కె.రత్న షీలామణి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. ఈ నియామకంపై వర్సిటీ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు రత్న షీలామణికి అభినందనలు తెలిపారు.