News July 24, 2024

14 ఏళ్లకే ఒలింపిక్స్‌ ‘కొలను’లో దిగుతున్న బాలిక

image

అసహ్యించుకొన్న రంగంలోనే అత్యున్నత శిఖరాలు అధిరోహిస్తుంటారు కొందరు. ఆ కోవకే చెందుతుంది స్విమ్మర్ ధినిధి(బెంగళూరు). 14ఏళ్లకే పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికైంది. ఈ ట్యాలెంటెడ్ గర్ల్ ఒకప్పుడు నీటిలో కాలు పెట్టేందుకే భయపడేది. ఈతకొట్టి ఒత్తిడితో వాంతులు చేసుకొనేది. పేరెంట్స్, కోచ్ సాయంతో అడ్డంకులు అధిగమించి అన్ని టెక్నిక్స్ నేర్చుకుంది. నేషనల్ గేమ్స్‌లో 7 పతకాలతో యంగెస్ట్ ఫీమేల్ స్విమ్మర్‌గా అవతరించింది.

Similar News

News November 13, 2025

కంపెనీల అనుమతుల్లో జాప్యం ఉండదు.. చంద్రబాబు స్పష్టం

image

AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని CM CBN స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన ఇండియా-యూరప్ బిజినెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్‌ విధానంలో ముందుకెళ్తున్నామని, కంపెనీల అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదని తేల్చి చెప్పారు. త్వరలో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ అందుబాటులోకి రానున్నాయని వివరించారు.

News November 13, 2025

‘ఉగ్ర’వర్సిటీ.. పేలుళ్లకు పథక రచన అక్కడే!

image

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో ఫరీదాబాద్‌ అల్ ఫలాహ్ వర్సిటీ వార్తల్లో నిలిచింది. దేశంలో కల్లోలం సృష్టించేందుకు ఇక్కడి నుంచే డా.ఉమర్ నబీ, ముజమ్మిల్ పథకం రచించారు. వీరు డాక్టర్లు షాహీన్, ఆదిల్‌తో సంప్రదింపులు జరిపారు. 4 నగరాల్లో పేలుళ్లు జరపాలనుకున్నారు. కానీ ఫండ్ రైజ్ డబ్బుల విషయంలో ఉమర్, ముజమ్మిల్‌ మధ్య విభేదాలు రావడంతో ప్లాన్ ప్రకారం వారు అనుకున్నట్లు జరగలేదు. లేదంటే మరింత మంది బలయ్యేవారేమో!

News November 13, 2025

తెలంగాణలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం

image

దేశీయ మంచి నీటి చేపలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం తెలంగాణలోని రంగారెడ్డి(D) కోహెడలో 13ఎకరాలను ఎంపిక చేసింది. దీని ఏర్పాటుకు రూ.47 కోట్లను మంజూరు చేసింది. దేశంలోని జలాశయాలు, డ్యాములు, చెరువులు, కుంటల్లో చేపలను దేశవిదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.