News July 24, 2024
సీఎం రేవంత్ రాజీనామా చేయాలి: కిషన్ రెడ్డి

TG: కేసీఆర్ బాటలోనే రేవంత్ వెళ్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. 100 రోజుల్లోనే హామీలు నెరవేరుస్తామని వెనకడుగు వేశారని మండిపడ్డారు. తానెలాంటి హామీ ఇచ్చి వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. రాజీనామా చేయాల్సి వస్తే రేవంత్ చేయాలని కౌంటర్ ఇచ్చారు. రేవంత్ దయతో తాను కేంద్రమంత్రిని కాలేదన్నారు. పాలన చేతకాక కేంద్రాన్ని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.
Similar News
News January 1, 2026
రాగి ఆభరణాలతో చర్మ సంరక్షణ

రాగి ఆభరణాలను ధరించడం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో రాగి ఆభరణాలు మనకు ఎంతో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. రాగి ఆభరణాలను ధరించడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయి. చర్మం రంగు కూడా మెరుగుపడుతుంది. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా ఉంటారు. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
News January 1, 2026
కొత్త సంవత్సరం.. ఇంటికి ఇవి తెచ్చుకుందామా?

కొత్త ఏడాదిలో అదృష్టం కోసం ఇంటికి శ్రీయంత్రం, వెండి నాణెం తేవాలని వాస్తు, జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. మనీ ప్లాంట్, తులసి మొక్కలు నాటాలని చెబుతున్నారు. ‘తాబేలు ప్రతిమ, దక్షిణామూర్తి చిత్రపటాన్ని పూజ గదిలో అమర్చాలి. కుబేర యంత్రం, గోమతి చక్రాలు కొనుగోలు చేసిన ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లుతుంది’ అంటున్నారు. కొత్త ఏడాదిలో లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 1, 2026
పండగ వేళ ప్రయాణికులకు RTC గుడ్ న్యూస్

TG: సంక్రాంతి పండగ వేళ టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. అప్ అండ్ డౌన్(రానూపోనూ) టికెట్ బుక్ చేసుకుంటే ఛార్జీల్లో 10శాతం రాయితీ ప్రకటించింది. ఇప్పటికే పలు మార్గాల్లో టికెట్ ధరలు, ఈవీ బస్సు ప్రయాణాల్లో రాయితీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ <


