News July 24, 2024

ప్లేయర్లు క్రమశిక్షణతో ఉండాలి: జయసూర్య

image

శ్రీలంక తాత్కాలిక కోచ్‌గా నియమితులైన జయసూర్య ఆటగాళ్లకు క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ప్లేయర్లంతా సరైన హెయిర్ కట్ చేయించుకోవడంతో పాటు నీట్‌గా ఉండాలని ఆదేశించారు. యువ ఆటగాళ్లలో క్రమశిక్షణ ముఖ్యమన్నారు. అభిమానులు ప్లేయర్లను గమనిస్తూ ఉంటారని చెప్పారు. భారత జట్టులో అనుభవజ్ఞులు రోహిత్, కోహ్లీ, జడేజా లేని అవకాశాన్ని శ్రీలంక ఉపయోగించుకోవాలని ఆటగాళ్లకు సూచించారు.

Similar News

News October 26, 2025

నవంబర్ 3 నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్

image

TG: రాష్ట్రంలో నవంబర్ 3 నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్ చేపట్టాలని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య మీటింగ్‌లో నిర్ణయించారు. NOV 1లోపు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని లేకపోతే నిరవధిక బంద్ చేపడతామని ఆ సమాఖ్య ఛైర్మన్ రమేశ్ బాబు ప్రకటించారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే రోజుకో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అటు HYDలో లెక్చరర్లతో భారీ బహిరంగ సభ, 10లక్షల మంది విద్యార్థులతో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.

News October 26, 2025

ఏపీలో నిర్మలా సీతారామన్ పర్యటన వాయిదా

image

AP: రాష్ట్రంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన వాయిదా పడింది. ఎల్లుండి అమరావతిలో ఒకేసారి 12 బ్యాంకులకు శంకుస్థాపన చేసేందుకు ఆమె రేపు రాష్ట్రానికి రావాల్సి ఉంది. కానీ మొంథా తుఫాన్ కారణంగా మంత్రి పర్యటన వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు. తదుపరి తేదీ త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

News October 26, 2025

మహిళల కోసం మెప్మా కొత్త కార్యక్రమాలు

image

ఏపీలో లక్షమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. MEPMA ద్వారా చేపట్టే 8 కార్యక్రమాలు మహిళ పారిశ్రామిక వేత్తలకు మార్గదర్శకం కానున్నాయి. పారిశ్రామిక వేత్తలుగా రాణించేందుకు, ప్రోత్సహించేందుకు అవసరమైన సమాచార పుస్తకాలు ప్రభుత్వం రూపొందించింది. వీటిని మహిళా సాధికారత, డిజిటల్ శిక్షణ, స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించారు.