News July 25, 2024
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ.. పోలవరం డయాఫ్రం వాల్‌పై తీర్మానం!

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణంపై తీర్మానం చేయనున్నట్లు సమాచారం. దీనితో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించే అవకాశముంది. పోలవరం డయాఫ్రం వాల్‌కు సంబంధించి క్యాబినెట్ తీర్మానం కావాలని కేంద్రం కోరడంతో నేడు అత్యవసరంగా మంత్రివర్గ భేటీ నిర్వహిస్తున్నారు.
Similar News
News December 26, 2025
యజ్ఞం ఎందుకు చేస్తారు?

యజ్ఞం ద్వారా మనం ప్రకృతి శక్తులకు కృతజ్ఞత తెలుపుతాం. దీన్ని లోకకల్యాణం కోసం చేస్తాం. శాస్త్రీయంగా చూస్తే.. యజ్ఞగుండంలో వాడే హోమ ద్రవ్యాలు, నెయ్యి, సమిధలు కాలి గాలిలోకి విడుదలైనప్పుడు వాతావరణం శుద్ధి అవుతుంది. మంటల నుంచి వెలువడే ఔషధ గుణాలు గల పొగ బ్యాక్టీరియాను నశింపజేసి వర్షాలు కురవడానికి తోడ్పడుతుంది. అలాగే, యజ్ఞంలో పఠించే మంత్రాల ప్రకంపనలు మెదడును ప్రశాంతపరిచి, సానుకూల శక్తిని పెంచుతాయి.
News December 26, 2025
$2టికెట్‌తో ₹16,153 కోట్లు గెలుచుకున్నాడు!

అమెరికాలోని పవర్‌బాల్ లాటరీలో ఓ వ్యక్తికి అదృష్టం వరించింది. క్రిస్మస్ ఈవ్ రోజున జరిగిన డ్రాలో ఏకంగా $1.8B (సుమారు రూ.16,153 కోట్లు) జాక్‌పాట్ తగిలింది. ఈ లాటరీలో ఒక సారి డబ్బులు ఎవరికీ దక్కకపోతే ఆ మొత్తం తరువాత టికెట్లకు యాడ్ అవుతుంది. దీంతో విన్నర్‌లకు అందే సొమ్ము భారీగా పెరుగుతుంది. గత 3 నెలలుగా ఎవరికీ దక్కని జాక్‌పాట్ ఓ వ్యక్తికి దక్కింది. కేవలం $2 టికెట్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.
News December 26, 2025
‘బాక్సింగ్ డే’ పేరెలా వచ్చిందంటే?

19వ శతాబ్దంలో బ్రిటన్‌లో పని మనుషులు క్రిస్మస్ రోజున కూడా పని చేసేవారు. దీంతో యజమానులు వారికి డిసెంబర్ 26న సెలవు ఇచ్చేవారు. క్రిస్మస్ వేడుకల్లో మిగిలిన పిండివంటలు, బహుమతులు, బట్టలు వంటివి చిన్న చిన్న బాక్సుల్లో పెట్టి అందించేవారు. అలా బాక్సుల్లో పెట్టి ఇవ్వడంతో బాక్సింగ్ డే అనే పేరు వచ్చింది. అలాగే చర్చిల ఎదుట బాక్సులు పెట్టి విరాళాలు సేకరించి డిసెంబర్ 26న పేదలకు పంచేవారు.


