News July 25, 2024
రాజీనామా వేళ రోశయ్య కీలక వ్యాఖ్యలు

పొన్నూరు మాజీ MLA కిలారి రోశయ్య బుధవారం YCPకి రాజీనామా చేస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో గుంటూరు పశ్చిమ టికెట్ తనకు రాకుండా కొందరు అడ్డుకున్నారన్నారు. గత ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం పొన్నూరు టికెట్ ఇవ్వాలని కోరినా అధిష్ఠానం పట్టించుకోలేదని చెప్పారు. పార్టీ వ్యతిరేకులకే పదోన్నతులు ఇచ్చారని ఆరోపించారు. ఉమ్మారెడ్డితో చర్చించకుండానే మండలిలో ప్రతిపక్షనేత పదోన్నతి కల్పించారని రోశయ్య అన్నారు.
Similar News
News November 10, 2025
గుంటూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ సూచన

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల ప్రధాన కార్యాలయాల్లో జరుగుతుందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.inలో కూడా సమర్పించవచ్చని, అదేవిధంగా 1100 నంబర్‌కి డయల్ చేసి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజలు పీజీఆర్ఎస్‌ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు.

News November 9, 2025
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద అప్టేట్

తాడేపల్లి పరిధి ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ఇన్‌ఫ్లో 68,623 క్యూసెక్కులు ఉండగా దిగువకు 60,150 క్యూసెక్కులు, కేఈ మెయిన్ ద్వారా 3,238 క్యూసెక్కులు, కేడబ్ల్యు మెయిన్ 5,009 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్ ద్వారా 226 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 12 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు.