News July 25, 2024
హమాస్‌పై యుద్ధానికి US సపోర్ట్ కావాలి: ఇజ్రాయెల్ PM

గాజాతో యుద్ధంలో పూర్తి విజయాన్ని సాధించేవరకూ పోరాటం కొనసాగిస్తామని ఇజ్రాయెల్ PM నెతన్యాహు తెలిపారు. హమాస్‌తో పాటు ఇరాన్ మద్దతున్న గ్రూపులతో పోరాడేందుకు తమకు యూఎస్ సపోర్ట్ కావాలన్నారు. US, ఇజ్రాయెల్ కలిసి పని చేస్తే వారిని ఓడించవచ్చని అన్నారు. ‘మా యుద్ధం మీ యుద్ధమే. మా శత్రువులూ మీకు శత్రువులే. మా విజయం మీకూ విజయమే’ అని యూఎస్ కాంగ్రెస్‌లో వ్యాఖ్యానించారు.
Similar News
News April 1, 2026
విద్యుత్ సిబ్బంది భద్రత పరికరాలు ధరించాలి: ఎస్ఈ

క్షేత్రస్థాయిలో విద్యుత్ పనులు నిర్వహించే ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా భద్రతా పరికరాలు ధరించి పని చేయాలని ఎన్పీడీసీఎల్ వరంగల్ ఎస్ఈ గౌతమ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హెల్మెట్, హ్యాండ్ గ్లౌజ్, ఎర్త్ రాడ్ వంటి భద్రతా పరికరాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు చేయరాదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News April 1, 2026
కళ్లు అదురుతున్నాయా? 7 కారణాలివే

కళ్లు అదరడం అనారోగ్య సమస్యకు సంకేతమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి/ఆందోళన, అలసట, కెఫిన్/ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం, పోషకాహార లోపం, పొల్యూషన్ వల్ల వచ్చే ఐ అలెర్జీ, మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వంటి 7 అంశాలు దీనికి కారణాలు కావచ్చని పేర్కొంటున్నారు. కళ్లు అదరడం వారానికి మించి కొనసాగితే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News April 1, 2026
అమరావతిని ఇంచు కూడా కదలించలేరు: CBN

AP: రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతేనని ఇక దాన్ని ఇంచు కూడా ఎవరూ కదిలించలేరని CM CBN వ్యాఖ్యానించారు. ‘అమరావతి బిల్లును లోక్‌సభలో ఇవాళ పెట్టారు. రేపు రాజ్యసభలో ఆమోదిస్తారు. గత పాలకులు అమరావతిని విధ్వంసం చేశారు. ఎడారి అని, శ్మశానమని ఎగతాళి చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు’ అని నెల్లూరు జిల్లా వింజమూరు సభలో విమర్శించారు. అటు తల్లికి వందనం నిధులను జూన్‌లో అందిస్తామని CBN తెలిపారు.


