News July 25, 2024

చంద్రశేఖరపురం: ఆటో బోల్తా.. వ్యక్తి మృతి

image

ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చంద్రశేఖరపురం మండలంలోని అరివేముల గ్రామం వద్ద బుధవారం చోటు చేసుకుంది. మండలంలోని పెద్దగోగులపల్లికి చెందిన ఆటో డ్రైవర్ గుర్రం గురవయ్య (65) స్వగ్రామానికి వెళ్తుండగా అరివేముల వద్ద ఆటో బోల్తాపడడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 16, 2026

ఒంగోలు: రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మృతి

image

మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మనపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నాయకుడు మృతిచెందాడు. నెల్లూరుకు చెందిన మైనార్టీ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ జాఫర్ షరీఫ్(54) కారులో విజయవాడ నుంచి ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. జాఫర్ షరీఫ్‌ను ఒంగోలు కిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు.

News January 15, 2026

ప్రకాశం: ట్రాక్టర్ రివర్స్ పోటీలు

image

దర్శి మండలం రాజంపల్లిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా బుధవారం తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాక్టర్స్ రివర్స్ పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీలను దర్శి టీడీపీ ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఆమె మాట్లాడుతూ.. సంక్రాంతి వంటి పండుగలు గ్రామీణ క్రీడలను, రైతు సంస్కృతిని ప్రతిబింబిస్తాయని, ఇలాంటి వినూత్న పోటీలు యువతలో నైపుణ్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

News January 14, 2026

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఇన్‌ఛార్జి కలెక్టర్ రాజాబాబు

image

సంక్రాంతి పండగ సందర్భంగా మార్కాపురం జిల్లా ప్రజలకు ఇన్‌ఛార్జి కలెక్టర్ రాజబాబు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసే పల్లెల పండగగా సంక్రాంతి నిలుస్తుందన్నారు. బంధుమిత్రులను అందరిని కలుసుకొని కను విందులు చేసే అందరి పండగ సంక్రాంతి అన్నారు. రైతులకు పంట చేతికి వచ్చే కాలమని, ఆనందాన్ని కుటుంబంతో పంచుకొని సంతోషించే వేడుక సంక్రాంతి అన్నారు.