News July 25, 2024

నేడు అసెంబ్లీకి గులాబీ దళపతి

image

TG: BRS అధినేత, మాజీ CM కేసీఆర్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు అసెంబ్లీకి రానున్నారు. గాయం కారణంగా గత సమావేశాలకు గైర్హాజరయ్యారు. కాగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు వచ్చి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పలుమార్లు చెప్పింది. అటు తమ బాస్ సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే చూడాలని BRS అభిమానులూ వేచి చూస్తున్నారు. మొత్తానికి ఈరోజు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఆసక్తికరంగా సాగనున్నాయి.

Similar News

News April 4, 2026

పశ్చిమాసియా యుద్ధం.. నిర్మాణ రంగంపై భారం

image

పశ్చిమాసియా యుద్ధం దేశంలో నిర్మాణ రంగంపై పడింది. రంగులు, స్టీల్, సిమెంట్, టైల్స్, శానిటరీ వేర్ రేట్లు పెరిగాయి. పెట్రోలియం అనుబంధ ఉత్పత్తుల కొరతే దీనికి కారణం. బస్తా సిమెంట్ ధర ₹50 పెరగగా, స్టీల్ ధర టన్నుకు 18% పెరిగింది. ప్రొపేన్ గ్యాస్ సరఫరా తగ్గడంతో శానిటరీ వేర్ ధరలు 8-12% పెరిగినట్లు తెలుస్తోంది. ఇంధన కొరత సాకుతో రవాణా ఛార్జీల రూపంలో ఇటుక ధరలు కూడా ₹8 నుంచి ₹10-12కు పెంచినట్లు సమాచారం.

News April 4, 2026

నేవీ అమ్ములపొదిలోకి ‘అరిదమన్’

image

భారతీయ నౌకాదళంలోకి స్వదేశీ సాంకేతికతతో తయారైన అణు జలాంతర్గామి ‘అరిదమన్’ చేరింది. దీంతో నేవీ అమ్ములపొదిలోని న్యూక్లియర్ సబ్‌మెరైన్‌ల సంఖ్య మూడుకు పెరిగింది. ఇది INS అరిఘాట్, INS అరిహంత్‌తో పోలిస్తే అప్‌గ్రేడెడ్ వెర్షన్. ఈ జలాంతర్గామి 3,500 కిలోమీటర్ల రేంజ్‌‌కు వెళ్లే అణుసామర్థ్యం గల ఎనిమిది కే-4 మిసైళ్లను మోయగలదు. దీంతో పాటు 24 K-15 సాగరిక న్యూక్లియర్ మిసైల్స్‌ను కూడా మోసే సామర్థ్యం ఉంది.

News April 4, 2026

ఓడామని వదలొద్దు.. ప్రయత్నిస్తే విజయం తథ్యం

image

అనగననగ రాగమతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ!
తాత్పర్యం: సంగీతం రానివారైనా రాగాలను పదేపదే ఆలపిస్తూ ఉంటే కొన్నాళ్లకు వినసొంపుగా పాడగలుగుతారు. వేప ఆకులు చేదుగా ఉన్నా రోజూ తింటూ ఉంటే కొన్నాళ్లకు తియ్యగా అనిపిస్తాయి. ఏ రంగమైనా సాధనతో నైపుణ్యం పెరిగి రాణిస్తారు. తొలిసారి విఫలమైనా తుదకు విజయం సాధిస్తారు.