News July 25, 2024

ట్యూషన్ టీచర్‌తో ప్రేమ.. ఆన్‌లైన్ ఆర్డర్లతో వేధింపులు!

image

చెన్నైలో ట్యూషన్‌ టీచర్‌(22)తో ప్రేమలో పడ్డాడు ఓ మైనరు(17). ఇటీవల ఆమె అతణ్ని దూరం పెట్టడంతో పగ పెంచుకుని వినూత్న రీతిలో వేధించడం మొదలుపెట్టాడు. ఆమె ఇంటికి వందలాది క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు, ఓలా, ఉబర్ రైడ్స్‌ బుక్ చేశాడు. వచ్చిన వారికి సమాధానం చెప్పుకోలేక యువతి కుటుంబం ఉక్కిరిబిక్కిరైంది. దీనిపై వారు పోలీసులను ఆశ్రయించగా నిందితుడ్ని పట్టుకున్నారు. అతనికి కౌన్సెలింగ్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

Similar News

News November 4, 2025

నలుగురు ఎమ్మెల్యేలను విచారించనున్న స్పీకర్

image

TG: ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ రెండో విడత విచారణ చేపట్టనున్నారు. 6, 12న తెల్లం వెంకట్రావ్, సంజయ్‌, 7, 13న పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలను రెండు సార్లు విచారించనున్నారు. తొలుత పిటిషనర్లు, తర్వాత ప్రతివాదులను ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అంతకుముందు తొలి విడతలో <<17912398>>ఇద్దరు<<>> ఎమ్మెల్యేలను విచారించిన సంగతి తెలిసిందే.

News November 4, 2025

APEDAలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్‌డ్ ఫుడ్ ప్రొడక్ట్ ఎక్స్‌పర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ(APEDA) 6 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BSc( అగ్రికల్చర్, హార్టికల్చర్, ప్లాంటేషన్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, వెటర్నరీ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్), పీజీ(కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఐటీ) అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News November 4, 2025

డ్రైవరన్నా.. వేగం తగ్గించు!

image

TG: ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సైతం వేగంగా వెళ్తున్నారని ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో రాష్ డ్రైవింగ్ చేస్తున్నారని, దీనివల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని అంటున్నారు. మరోవైపు మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిందని, ఒత్తిడికి గురవుతున్నామని డ్రైవర్లు, కండక్టర్లు వాపోతున్నారు. ప్రభుత్వం బస్సుల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు.