News July 25, 2024

ప్రాజెక్టుల వారీగా నీటి సమాచారం

image

>>గోదావరి నది
1.శ్రీరాంసాగర్: ఇన్ ఫ్లో 19వేల క్యూసెక్కులు. నీటి నిల్వ 26.11/90 టీఎంసీలు.
2.ఎల్లంపల్లి: ఇన్ ఫ్లో 25వేల క్యూసెక్కులు. నీటి నిల్వ 13.8/20.17 టీఎంసీలు
3.మేడిగడ్డ బ్యారేజీ: 7.7 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో
>>కృష్ణానది
1.శ్రీశైలం: ఇన్ ఫ్లో 1.93 లక్షల క్యూసెక్కులు. నీటి నిల్వ 85/215.81 టీఎంసీలు

Similar News

News December 30, 2024

దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరంటే?

image

భారత్‌లో రిచెస్ట్ CMగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (₹931కోట్లు) నిలిచారు. ఆయన చరాస్తుల విలువ ₹810cr కాగా స్థిరాస్తుల విలువ ₹121crగా ఉంది. ఇక ఈ లిస్టులో అరుణాచల్ CM పెమా ఖండు (₹332cr) రెండో స్థానంలో, కర్ణాటక CM సిద్దరామయ్య (₹51cr) మూడో స్థానంలో ఉన్నారు. అత్యల్ప ఆస్తులున్న సీఎంగా ప.బెంగాల్ CM మమతా బెనర్జీ (₹15లక్షలు) నిలిచారు. J&K CM ఒమర్ ₹55లక్షలు, కేరళ CM విజయన్ ₹కోటి విలువ గల ఆస్తి కలిగి ఉన్నారు.

News December 30, 2024

మన్మోహన్ అస్థికల నిమజ్జనం.. విమ‌ర్శ‌ల‌పై స్పందించిన కాంగ్రెస్‌

image

మ‌న్మోహ‌న్ సింగ్ కుటుంబ సభ్యుల వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూ ఆయన అస్థిక‌ల‌ను య‌మునా న‌దిలో క‌లిపే కార్య‌క్ర‌మంలో పార్టీ నేత‌లు పాల్గొన‌లేదని కాంగ్రెస్ వివ‌ర‌ణ ఇచ్చింది. అంత్య‌క్రియ‌ల అనంత‌రం మ‌న్మోహ‌న్ కుటుంబాన్ని వారి నివాసంలో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ క‌లిసి పరామర్శించారని తెలిపింది. అస్థిక‌లు న‌దిలో క‌లిపే విష‌య‌మై వారితో చ‌ర్చించాకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు కాంగ్రెస్ వెల్ల‌డించింది.

News December 30, 2024

స్పేస్ డాకింగ్: నాలుగో దేశంగా భారత్

image

ISRO చేపడుతోన్న ‘స్పేడెక్స్ మిషన్’ సక్సెస్ అయితే ప్రపంచంలో స్పేస్ డాకింగ్ సాంకేతికత కలిగి ఉన్న నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. ఈ టెక్నాలజీ విషయంలో US, రష్యా, చైనా ముందంజలో ఉన్నాయి. చంద్రయాన్-4, ఇండియన్ స్పేస్ సెంటర్ వంటి భవిష్యత్తు ప్రాజెక్టుల్లో ఈ డాకింగ్ టెక్నాలజీ కీలకంగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్ తెలిపారు.