News July 25, 2024
మరణంలోనూ వీడని తల్లీకుమారుల బంధం

విధి రాతకు బలైన ఓ కుటుంబ విషాదాంతమిది. HYDలో తన భార్య, కుమారులతో కలిసి ఉంటున్న గుంజి శివ కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. కుటుంబ పోషణ, పిల్లల కాలేజీ ఫీజులకూ డబ్బుల్లేక తల్లి గత రాత్రి ఉరి వేసుకుంది. తల్లి మరణాన్ని తట్టుకోలేక పెద్ద కొడుకు వంశీ(18) క్షణాల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదాన్ని చూసి రెండో కుమారుడి గుండెలు పగిలాయి. ఒంటరిగా మిగిలానంటూ రోదించిన తీరు హృదయాలను కలిచివేసింది.
Similar News
News July 7, 2025
కాసేపట్లో ఐసెట్ ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

TG: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్-2025 ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. జూన్ 8, 9 తేదీల్లో నిర్వహించిన పరీక్షలకు 71, 757 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 64,398 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా పొందవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్‌పై హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే రిజల్ట్స్ కనిపిస్తాయి.
News July 7, 2025
ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

పంజాబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హోషియార్‌పూర్‌లోని హాజీపూర్ రోడ్డులో బస్సు బోల్తా పడి 8 మంది మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు.
News July 7, 2025
ఆరెంజ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 11 వరకు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.