News July 25, 2024
TG 09A 9999 కోసం రూ.19లక్షలు

తెలంగాణలో <<13621366>>TG సిరీస్<<>>తో ఉన్న ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల కోసం వాహనదారులు పోటీ పడుతున్నారు. నిన్న HYDలోని ఖైరతాబాద్ ఆర్టీవోలో జరిగిన వేలంలో TG 09A 9999 నంబర్ రికార్డు స్థాయిలో రూ.19,51,111 పలికింది. హానర్స్ డెవలపర్స్ అనే సంస్థ ఈ నంబర్‌ను దక్కించుకుంది. TG 09B 0001 నంబర్ రూ.8.25లక్షలు పలికింది. వీటితో పాటు పలు ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా నిన్న ఒక్క రోజే రూ.51,17,517 ఆదాయం వచ్చింది.
Similar News
News January 8, 2026
సర్ఫరాజ్ రికార్డు.. 15 బాల్స్‌లో 50

ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ VHTలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశారు. పంజాబ్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆయన 15బాల్స్‌లో 50 రన్స్ చేసి చరిత్ర సృష్టించారు. దూకుడుగా ఆడిన సర్ఫరాజ్ (62) అభిషేక్ శర్మ వేసిన ఒకే ఓవర్‌లో 6, 4, 6, 4, 6, 4 బాది 30 పరుగులు చేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో ముంబై ఓడింది. ఇంతకుముందు ఈ రికార్డు బరోడా బ్యాటర్ అతీత్ శేఠ్ (16 బాల్స్‌లో 50) పేరున ఉంది.
News January 8, 2026
త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ: CM

TG: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తరహాలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురానున్నట్లు CM రేవంత్ తెలిపారు. సచివాలయంలో CMతో హిమాచల్‌ప్రదేశ్ మంత్రి రోహిత్ కుమార్ భేటీ అయ్యారు. ‘అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే చోట రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్య అందిస్తాం. చిన్నారులను స్కూళ్లకు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యాన్ని కల్పించే అంశంపై యోచిస్తున్నాం’ అని CM వివరించారు.
News January 8, 2026
బంగ్లాదేశ్‌లో హిందువు హత్య.. ప్రధాన నిందితుడు అరెస్టు

బంగ్లాదేశ్‌లో సంచలనం రేపిన హిందువు <<18624742>>దీపూ దాస్ హత్య<<>> కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మాజీ టీచర్ యాసిన్ అరాఫత్‌ను ఇవాళ పట్టుకున్నారు. ‘దీపూ దాస్‌పై దాడికి ప్లానింగ్, అమలులో ఇతడు కీలకపాత్ర పోషించాడు. గుంపును ఎగదోయడం మాత్రమే కాదు.. దీపూను స్వయంగా కూడలిలోకి లాక్కెళ్లాడు. ఇన్నిరోజులు పరారీలో ఉన్నాడు’ అని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటిదాకా 21 మంది అరెస్టయ్యారు.


