News July 25, 2024

దేశ రక్షణకు నార్త్ బెంగాల్ కీలకం (3)

image

నార్త్ బెంగాల్లో డార్జిలింగ్, కలింపాంగ్, జల్పాయ్‌గుడి, అలీపుర్దార్, కూచ్ బెహార్ జిల్లాలు ఉంటాయి. నార్త్, సౌత్ దినాజ్‌పుర్, మాల్దాలోని కొన్ని ప్రాంతాలు కలుస్తాయి. సౌత్‌తో పోలిస్తే ఇక్కడి ప్రజల సంస్కృతి చాలా భిన్నం. నేపాల్, భూటాన్, బంగ్లా ప్రభావం కనిపిస్తుంది. ఈశాన్య భారతంతో సత్సంబంధాలు ఉంటాయి. అందుకే అందులో కలిపేస్తే ప్రత్యేక ప్యాకేజీ అమలవ్వడమే కాకుండా మరింత డెవలప్మెంట్ జరుగుతుందని ప్రజల కోరిక.

Similar News

News January 16, 2026

APలో స్మాల్ మిక్స్‌డ్ మాడ్యులర్ ఎనర్జీ రియాక్టర్

image

AP: థర్మల్ ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గిస్తూ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేలా చిన్నస్థాయిలో థర్మల్, హైడ్రో మిక్స్‌డ్ ఎనర్జీ రియాక్టర్‌ను నెలకొల్పేందుకు ఏపీ జెన్కో ఆలోచిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో కోల్ ఇండియాతో కలిసి జాయింట్ వెంచర్ కింద దీనికి సంబంధించిన ప్లాంటు ఏర్పాటు ఆలోచన ఉందని జెన్‌కో ఎండీ నాగలక్షి ‘ది హిందూ’తో పేర్కొన్నారు. అయితే ఇది బొగ్గు రవాణా, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు.

News January 16, 2026

IOCLలో 405 పోస్టులకు నోటిఫికేషన్

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>IOCL<<>>) వెస్ట్రన్ రీజియన్‌లో 405 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు JAN 31వరకు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. ITI, డిప్లొమా, గ్రాడ్యుయేట్(BA/BCom/BSc/BBA) ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iocl.com

News January 16, 2026

‘అనగనగా ఒక రాజు’.. రూ.41.2 కోట్ల కలెక్షన్స్

image

నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వరల్డ్ వైడ్‌గా 2 రోజుల్లో రూ.41.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్‌మెంట్స్ ప్రకటించింది. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. మొదటి రోజు ఈ చిత్రం రూ.22కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.