News July 25, 2024
ఈ నెల 27కు సభ వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. రాష్ట్ర బడ్జెట్ 2024-25ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన వెంటనే సభను స్పీకర్ వాయిదా వేశారు. ఈ నెల 27న(శనివారం) తిరిగి సభ ప్రారంభమవుతుందని చెప్పారు.
Similar News
News December 21, 2024
వాయుగుండం.. రేపు, ఎల్లుండి వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తూర్పు-ఈశాన్య దిశగా కదులుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతం ఇది విశాఖకు 430కి.మీ, చెన్నైకి 490కి.మీ, గోపాల్పూర్(ఒడిశా)నకు 580కి.మీ దూరంలో ఉందని పేర్కొంది. ఆ తర్వాత సముద్రంలో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే వాయుగుండం ప్రభావంతో రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
News December 21, 2024
కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS సెటైరికల్ ట్వీట్
TG: రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ సెటైరికల్ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పాలన గురించి అర్థం వచ్చేలా సింగిల్ లైన్లో చమత్కరించింది. రేవంత్ ప్రభుత్వం ఏడాది పాలన ఒక లైన్లో అని ‘ǝuı̣ꓶ ǝuO uı̣ ǝןnꓤ ɹɐǝ⅄ ǝuO ʇuǝɯuɹǝʌoꓨ ɥʇuɐʌǝꓤ’ ఇలా ‘X’ పోస్ట్ చేసింది. దీనిపై ఇరుపార్టీల కార్యకర్తలు పోటాపోటీగా కామెంట్లు పెడుతున్నారు.
News December 21, 2024
ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరో ఎవరంటే?
దేశంలోనే మోస్ట్ పాపులర్ నటుడి(నవంబర్)గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలిచినట్లు ORMAX మీడియా పేర్కొంది. గత నెలలోనూ ఆయనే ఈ స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత దళపతి విజయ్, అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఇక మోస్ట్ పాపులర్ నటిగా ఈ నెల కూడా సమంత నిలిచారు. ఆమె తర్వాత ఆలియా, నయనతార, సాయి పల్లవి, దీపికా పదుకొణె, త్రిష ఉన్నారు.