News July 25, 2024

ర్యాగింగ్‌పై YCP ట్వీట్.. హోం మంత్రి కౌంటర్

image

ఏపీలో ఎప్పుడూ లేని విధంగా <<13702341>>ర్యాగింగ్<<>> శృతి మించుతోందని వైసీపీ చేసిన ట్వీట్‌కు హోం మంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. ‘గత YCP ప్రభుత్వంలో ఫిబ్రవరి 2024న జరిగిన ఈ ర్యాగింగ్‌పై ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం వల్ల బయటకు వచ్చింది. గత ప్రభుత్వంలో జరిగిన దాడులను మాకు అంట కట్టడం వైసీపీ మానుకుంటే మంచిది. పట్టాలు తప్పిన లా అండ్ ఆర్డర్‌ను ఇప్పుడిప్పుడే గాడిలోకి తెస్తున్నాం. ఎవరు తప్పు చేసినా వదలం’ అని మంత్రి తెలిపారు.

Similar News

News November 10, 2025

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,23,220కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 ఎగబాకి రూ.1,12,950 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.2,000 పెరిగి రూ.1,67,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 10, 2025

ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

image

TG: కవి అందెశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. అందెశ్రీ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరిగే అవకాశం ఉంది. ఆయన రచించిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రేవంత్ సర్కార్ రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

News November 10, 2025

ప్రస్థానత్రయం అంటే ఏమిటి?

image

హిందూ తత్వశాస్త్రంలో అత్యంత ప్రామాణిక గ్రంథాలైన ఉపనిషత్తులు(శ్రుతి ప్రస్థానం), బ్రహ్మ సూత్రాలు(న్యాయ ప్రస్థానం), భగవద్గీత (స్మృతి ప్రస్థానం).. ఈ మూడింటిని కలిపి ‘ప్రస్థానత్రయం’ అంటారు. ఇవి జ్ఞాన మార్గానికి దారులుగా పరిగణిస్తారు. ముఖ్య సిద్ధాంతాలకు ఇదే ఆధారం. ప్రతి ఆచార్యుడు తమ సిద్ధాంతాలను స్థాపించడానికి వీటిపై భాష్యం రాయడం తప్పనిసరి. ఇవి బ్రహ్మ జ్ఞానాన్ని బోధించే అత్యున్నత గ్రంథాలు. <<-se>>#VedikVibes<<>>