News July 25, 2024

FIRST PHOTO: అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా KCR

image

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన సభలో పాల్గొన్నారు. కేసీఆర్ ముందువరుసలో కూర్చోగా ఆయన వెనకాలే సికింద్రాబాద్ MLA పద్మారావుగౌడ్, కరీంనగర్ MLA గంగుల కమలాకర్ కూర్చున్నారు. బడ్జెట్ ప్రసంగం ముగియగానే సభ వాయిదా పడటంతో కేసీఆర్ అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.

Similar News

News November 8, 2025

₹60,799Crతో రోడ్ల నిర్మాణం.. రికార్డు: మంత్రి

image

TG: రాష్ట్రంలో ₹60,799Crతో రోడ్లు నిర్మించనున్నట్లు మంత్రి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో ఇది రికార్డని, RRR నిర్మాణానికి ₹36,000Cr, HYD-VJA హైవే విస్తరణకు ₹10,400కోట్లు, HAM ప్రాజెక్టుకు ₹11,399Cr కేటాయించామన్నారు. ₹8,000Crతో మన్ననూర్-శ్రీశైలం ఎలివేటర్ కారిడార్‌, ₹20,000Crతో ఫ్యూచర్ సిటీ-బందరు పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. గ్రామాల్లో డబుల్ రోడ్లు వేస్తామన్నారు.

News November 8, 2025

మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

image

ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి టీ20 వర్షం కారణంగా రద్దయింది. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన భారత్ 4.5 ఓవర్లలో 52 రన్స్ చేసింది. ఈ క్రమంలోనే మొదలైన వర్షం పెద్దదైంది. దీంతో ఆట సాధ్యం కాదని అంపైర్లు ప్రకటించారు. ఇప్పటికే 2-1 తేడాతో ముందంజలో ఉన్న భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి టీ20 కూడా వర్షం వల్ల రద్దు కాగా రెండో మ్యాచులో ఆసీస్.. మూడు, నాలుగో టీ20ల్లో ఇండియా గెలిచింది.

News November 8, 2025

మాలిలో ఐదుగురు ఇండియన్ కార్మికుల కిడ్నాప్

image

ఆఫ్రికన్ కంట్రీ మాలిలో ఓ కంపెనీలో పనిచేస్తున్న ఐదుగురు ఇండియన్ కార్మికుల్ని దుండగులు కిడ్నాప్ చేశారు. వెస్ట్రన్ మాలిలోని కోబ్రీలో విద్యుదీకరణ ప్రాజెక్టు పనుల్లో వారుండగా ఇది జరిగినట్లు భద్రతావర్గాలు AFPకి తెలిపాయి. మిగతా కార్మికుల్ని రాజధాని బమాకోకు తరలించారు. అల్‌ఖైదాతో సంబంధాలున్న JNIM జిహాదీలు ఇటీవల ముగ్గురిని అపహరించి $50Mలు తీసుకొని విడిచిపెట్టారు. తాజా ఘటనపై ఇంకా ఏ సంస్థా స్పందించలేదు.