News July 25, 2024

నిజామాబాద్: DEECET ఫలితాలు విడుదల

image

డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (D.ED) కళాశాలలో సీట్ల భర్తీ కోసం ఈ నెల 10న ఆన్‌లైన్‌లో నిర్వహించిన DEECET-2024 పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు నిజామాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఫలితాల కోసం https://deecet.cdse.telangana.gov.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ, వెబ్‌ ఆప్షన్ల నమోదు తేదీలను త్వరలో ప్రకటిస్తారని ఆయన వివరించారు.

Similar News

News November 23, 2025

NZB: సాధారణ కార్యకర్త నుంచి DCC అధ్యక్షుడిగా..!

image

నిజామాబాద్ DCC అధ్యక్షుడిగా నగేష్ రెడ్డి నియమితులయ్యారు. మోపాల్‌(M) ముల్లంగికి చెందిన చెందిన ఆయన 1986లో TDPనుంచి సర్పంచ్‌గా పని చేశారు. 1995లో కాంగ్రెస్‌లో చేరి 2004వరకు మోపాల్ సింగిల్ విండో ఛైర్మన్‌గా, 2014 వరకు 5 సార్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా చేశారు. కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి అంచలంచెలుగా ఎదిగారు. 2023లో MLA టికెట్ ఆశించగా పార్టీ భూపతి రెడ్డికి టికెట్ ఖరారు చేసింది.

News November 23, 2025

NZB: సాధారణ కార్యకర్త నుంచి డీసీసీ అధ్యక్షుడిగా..!

image

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నగేష్ రెడ్డి నియమితులయ్యారు. రూరల్ మండలం మోపాల్‌కు చెందిన ఆయన కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి అంచలంచెలుగా ఎదిగారు. పీసీసీ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యేగా టికెట్ ఆశించిన, చివరకు భూపతి రెడ్డికి అధిష్టానం టికెట్ ఖరారు చేసింది.

News November 23, 2025

త్వరలో జిల్లా అంతటా పర్యటిస్తా: జీవన్ రెడ్డి

image

త్వరలో నిజామాబాద్ జిల్లా అంతటా పర్యటించి,స్థానిక పోరుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తానని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆపద కాలంలో పార్టీ కోసం పోరాడుతున్న గులాబీ శ్రేణులకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను గ్రామగ్రామాన ఎండగడతామని అన్నారు.