News July 25, 2024

గూగుల్ మ్యాప్స్ నుంచి కొత్త ఫీచర్లు(2/2)

image

ప్రస్తుతం ఈ ఫీచర్లను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్‌తో సహా 8 నగరాల్లోని ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలోనే IOS యూజర్లతో పాటు అన్ని నగరాలకు విస్తరించనుంది. మరో ఫీచర్ ప్రయాణ మార్గంలో ఫ్లైఓవర్లను గుర్తించి ఏ మార్గంలో వెళ్లాలో సూచిస్తుంది. దీంతో పాటు ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల సమాచారాన్ని అందించేలా మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

Similar News

News January 9, 2026

‘పరాశక్తి’ విడుదలకు లైన్ క్లియర్.. U/A సర్టిఫికెట్

image

శివకార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాకు లైన్ క్లియర్ అయింది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. రేపు విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ సెన్సార్ బోర్డు ఇవాళ్టి వరకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. అయితే ఆయా సన్నివేశాలను మేకర్స్ తొలగించడంతో తాజాగా సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో పరాశక్తి యథావిధిగా రేపు రిలీజ్ కానుంది.

News January 9, 2026

బ్లోఅవుట్ వద్ద సీఎం ఏరియల్ వ్యూ

image

AP: కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. సిబ్బంది చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్‌పై సీఎం ఆరా తీశారు. ఇటీవల గ్యాస్ బ్లోఅవుట్ జరిగి మంటలు చెలరేగగా ఇంకా అదుపులోకి రాలేదు. పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News January 9, 2026

రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు

image

తెలుగు రాష్ట్రాల్లోని స్కూలు విద్యార్థులకు గుడ్‌న్యూస్. పాఠశాలలకు నేడే చివరి వర్కింగ్ డే. రేపటి నుంచి సంక్రాంతి సెలవులు మొదలవ్వనున్నాయి. ఏపీలో ఈ నెల 18 వరకు కొనసాగుతాయి. 19న(సోమవారం) పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. తెలంగాణలో 17న(శనివారం) స్కూళ్లు పున:ప్రారంభం అవుతాయి. పిల్లలకు హాలిడేస్ నేపథ్యంలో పేరెంట్స్ స్వగ్రామాలకు పయనమవుతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారనున్నాయి.