News July 25, 2024
ఒంటరిగానే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి: రాజ్ ఠాక్రే

అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(MNS) చీఫ్ రాజ్ ఠాక్రే ప్రకటించారు. మహాయుతి కూటమితో పొత్తులో ఉండబోమని స్పష్టం చేశారు. రోడ్ల గుంతలు పూడ్చడానికి డబ్బులు లేకపోయినా ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటిస్తోందని ఆయన దుయ్యబట్టారు. మహారాష్ట్రలో 225-250 సీట్లలో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు.
Similar News
News January 3, 2026
నవగ్రహ ప్రదక్షిణలో పఠించాల్సిన మంత్రం

“ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:”
నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తే.. మనసు ఏకాగ్రతతో నిండి, గ్రహాల అనుగ్రహం వేగంగా లభిస్తుంది. సూర్యుడు మొదలుకొని కేతువు వరకు తొమ్మిది గ్రహాలను స్మరిస్తూ చేసే ఈ ప్రార్థన జాతక దోషాలను హరిస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. అలాగే గ్రహ గతులు అనుకూలించి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది.
News January 3, 2026
జీడిమామిడిలో వచ్చిన కాయలు నిలబడాలంటే?

జీడిమామిడిలో పూత తర్వాత వచ్చిన కాయలు చిన్నగా ఉన్నప్పుడే రాలిపోతుంటాయి. చాలా తోటల్లో ఇది కనిపిస్తుంది. ఈ సమస్య తగ్గి కొత్తగా వచ్చిన కాయలు నిలబడాలంటే 19-19-19 లేదా మల్టికే(13-0-45)ను లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి కాయలు తడిచేలా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కాయలు మొక్కలపై నిలబడి, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
News January 3, 2026
ఫిబ్రవరిలో డీఎస్సీ.. 2,500 పోస్టులు?

AP: రాష్ట్రంలో మరోసారి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో డీఎస్సీ నిర్వహణ ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరిలో 2,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. డీఎస్సీలో కొత్తగా ఇంగ్లిష్, కంప్యూటర్‌కు సంబంధించి ఒక పేపర్‌గా ఎగ్జామ్ నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉంది.


