News July 25, 2024

స్పీకర్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

image

TG: ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. BJLP నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌ను స్పీకర్ కార్యాలయం స్వీకరించాలని ఆదేశించింది. పిటిషనర్‌కు ధ్రువీకరణ రసీదు ఇవ్వాలని పేర్కొంది. కాగా దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని మహేశ్వర్ రెడ్డి స్పీకర్‌ను కోరినా స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే మహేశ్వర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారని ఏజీ తెలిపారు.

Similar News

News January 29, 2026

కేసీఆర్‌కు మూడోసారి నోటీసులు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు మాజీ CM KCRకు పోలీసులు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ఆసక్తిగా మారుతోంది. గతంలోనూ ఆయనకు వేర్వేరు ఇష్యూల్లో నోటీసులు అందాయి. INC అధికారంలోకి వచ్చిన తర్వాత PPAలపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇచ్చింది. దానిపై KCR హైకోర్టుకెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కూలడంపై ఏర్పాటైన జస్టిస్ ఘోష్ కమిషనూ నోటీసులిచ్చింది. KCR ఆ కమిషన్ ముందు హాజరయ్యారు.

News January 29, 2026

యాసంగి ఆముదం పంటలో పురుగుల కట్టడికి సూచనలు

image

యాసంగిలో సాగు చేసిన ఆముదం పంటలో వివిధ పురుగుల తీవ్రత పెరిగింది. రసం పీల్చే పురుగుల ఉద్ధృతి ఎక్కువగా ఉంటే వీటి నివారణకు ప్రొఫెనోఫాస్ 2ML లేదా ఎసిటామిప్రిడ్ 0.2గ్రా లేదా ఎసిఫేట్ 1.5గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంటను లద్దె పురుగు ఆశిస్తే లీటరు నీటికి నొవాల్యురాన్ 1ML కలిపి పిచికారీ చేయాలి. కాయతొలుచు పురుగు నివారణకు లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ML కలిపి పిచికారీ చేయాలి.

News January 29, 2026

పేపర్ ప్లేట్‌గా బ్యాంకు డాక్యుమెంట్.. ప్రైవసీ అంటే ఇదేనా?

image

కస్టమర్ పర్సనల్ డీటెయిల్స్ ఉన్న బ్యాంకు డాక్యుమెంట్ రోడ్డు పక్కన పేపర్ ప్లేట్‌గా మారడం ఇప్పుడు వైరలవుతోంది. పేరు, లొకేషన్, పేమెంట్ డీటెయిల్స్ వంటి సెన్సిటివ్ డేటా బహిరంగంగా కనిపించడంతో నెటిజన్లు షాకవుతున్నారు. కస్టమర్ డేటాను బ్యాంకులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వదిలేస్తాయని ప్రశ్నిస్తున్నారు. Moronhumor పేరిట ఉన్న X అకౌంట్‌లో ఈ ఫొటో చూశాక డేటా ప్రైవసీపై SMలో పెద్ద చర్చే నడుస్తోంది.