News July 25, 2024
శ్రీకాకుళం: మత్స్యకారులకు సీఆర్ జెడ్ అమలు చేయాలి

మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా సీఆర్ జెడ్ అమలు చేయాలని జిల్లాలోని తీరప్రాంత ప్రజలు కోరారు. పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు శ్రీకాకుళం జిల్లా కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ ఖరారు నిమిత్తం గురువారం సమావేశం నిర్వహించారు. సీఆర్ జెడ్ నోటిఫికేషన్ విడుదలపై తీర ప్రాంత ప్రజలు, అధికారులతో ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు.
Similar News
News January 21, 2026
SKLM: తమన్ మ్యూజికల్ షోకు పగడ్బందీ ఏర్పాట్లు

తమన్ మ్యూజికల్ షోకు పగడ్బందీగా బారికేడ్లు నిర్మించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఎస్సీ కేవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ప్రేక్షకులు వేలాది సంఖ్యలో వచ్చే పరిస్థితి ఉన్నందున తగిన జాగ్రత్తలు కింది స్థాయి అధికారులకు సూచించారు. వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని, ప్రవేశ, నిష్క్రమణ గేట్లు సక్రమంగా ఉండాలన్నారు.
News January 21, 2026
వినతులు స్వీకరించిన అచ్చెన్న

ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడాలని పరిష్కరించాలని ఆదేశించారు. మరికొన్ని సమస్యలను సంబంధిత శాఖలకు సిఫారసు చేశారు.
News January 21, 2026
కాశీబుగ్గ ఆలయంలో భారీ చోరీ.. ఎక్కడి వాళ్లు చేశారంటే!

కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల జరిగిన చోరీ ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కే.వీ మహేశ్వర రెడ్డి వివరాలు వెల్లడించారు. ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చోరీకి గురైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎల్.ఎన్.పేట మండలానికి చెందిన వారిగా గుర్తించారు.


