News July 25, 2024

నెల్లూరు: కార్మికుల మస్టర్ ఉదయం 5.30గంటలకే ముగించాలి

image

ప్రతీ డివిజనులో ఉదయం 5.30గంటలకు కార్మికుల మస్టర్ ముగించాలని నగరపాలక కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులకు కేటాయించిన యూనిఫామ్, గ్లౌజ్, అప్రాన్, చెప్పులు, పనిముట్లను పని ప్రదేశాల్లో తప్పనిసరిగా వినియోగించేలా చూడాలన్నారు. ఖాళీ స్థలాలను గుర్తించి గ్యాంగ్ వర్క్, జెసీబీలతో పారిశుద్ధ్య నిర్వహణ చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో, వీధుల్లో చెత్తవేసే పద్ధతిని నివారించాలన్నారు.

Similar News

News January 17, 2026

ఈ-ఆఫీస్ ద్వారానే అన్ని కార్యక్రమాలు: హెల్త్ డైరెక్టర్

image

PHC స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వైద్య సిబ్బంది కార్యకలాపాలను ఈ-ఆఫీస్ ద్వారా నిర్వహించాలని ప్రజా ఆరోగ్య శాఖ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ పద్మావతి సూచించారు. శనివారం జిల్లా వైద్యాధికారి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. కార్యకలాపాలను కాగిత రహిత పరిపాలనగా కొనసాగించాలన్నారు. మ్యానువల్ పద్ధతి నిర్వహిస్తే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

News January 17, 2026

ఉదయగిరి AMC ఛైర్మన్ పదవిపై హైకోర్టు కీలక తీర్పు.!

image

ఉదయగిరి AMC ఛైర్మన్ పదవిని BC జనరల్‌కు కేటాయిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఒకే రోజు ఒకే జీవో మీద ఉదయం బీసీ జనరల్ కేటాయిస్తూ సాయంత్రం రద్దు చేస్తూ ఓసీ మహిళకు కేటాయించడంపై జలదంకి MPTC మాధవరావు యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సమగ్రంగా విచారించిన హైకోర్టు న్యాయమూర్తి భానుమతి బీసీ జనరల్‌కే ఉదయగిరి మార్కెటింగ్ ఛైర్మన్ పదవి కేటాయించాలని తీర్పు ఇచ్చారు.

News January 17, 2026

నెల్లూరు: డ్రస్ సర్కిల్’ డ్రా విజేతకు కార్ అందజేత

image

నెల్లూరులోని ప్రముఖ వస్త్ర దుకాణం ‘డ్రస్ సర్కిల్ షాపింగ్ మాల్’లో క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి సందర్భంగా ‘భలే ఛాన్స్ బాసు’ లక్కీ డ్రాను ప్రవేశపెట్టారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి జనవరి 15 వరకు జరిగిన వస్త్రాల కొనుగోళ్లపై కూపన్లు అందించారు. ఈ డ్రాలో N.దయాకర్ రెడ్డి (కూపన్ నంబర్: 21038) మొదటి బహుమతిగా కారును గెలుచుకున్నారు.