News July 26, 2024

ప్రకాశం: జాతీయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేస్తున్న వారికి జాతీయ పురస్కారాలు అందించేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి. అర్చన తెలిపారు. డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అవార్డులు ప్రదానం చేస్తారన్నారు. ఈ పురస్కారానికి ఆసక్తి గలవారు ఆన్లైన్లో ఈనెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News November 28, 2024

కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్.!

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరో 2 కీలకమైన నిర్మాణాలు జరగనున్నాయి. స్వయంగా CM చంద్రబాబే ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో మొదటి దశ కింద ఇప్పటికే పలు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయని CM చంద్రబాబు చెప్పారు. రెండో దశ కింద వాడరేవు(చీరాల), కొత్తపట్నం(ఒంగోలు) వద్ద ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నామని ప్రకటించారు. ఇదే జరిగితే జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.

News November 27, 2024

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించిన MLA తాటిపర్తి

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విటర్(X) వేదికగా ప్రశ్నించారు. ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై విష ప్రచారం చేసి, ఇప్పుడు మా హయాంలో జరిగిన రీ సర్వే ప్రాజెక్టు గొప్పతనాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించి 500 కోట్ల రూపాయలు ప్రోత్సహకాలు తీసుకుంటుందని నిజం కాదా ?’ అని పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేశారు.

News November 27, 2024

ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్‌లో వైద్య పరీక్షలు

image

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హత్యాయత్నం కేసు విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిన్న రాత్రి సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని తాలుకా పోలీస్ స్టేషన్‌లోనే ఆయనను రాత్రి నుంచి ఉంచారు. అక్కడే వైద్య పరీక్షలు చేసి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించారు. గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు ఉండటంతో మరికాసేపట్లో అక్కడికి తరలిస్తారని సమాచారం.