News July 26, 2024

సరుబుజ్జిలి: అగ్రికల్చర్ అసిస్టెంట్ సస్పెండ్

image

సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామ సచివాలయ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కే.దుర్గారావు విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు గాను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఏవో బొడ్డేపల్లి పద్మనాభం గురువారం తెలిపారు. మద్యం సేవించి విధులకు హాజరు కావడం విత్తనాలు, ఎరువుల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Similar News

News February 3, 2026

శ్రీకాకుళం: 2 నెలల్లో కుమార్తె పెళ్లి..అంతలోనే విషాదం

image

ఆమదాలవలస మండలం చీమలవలసకి చెందిన బొడ్డేపల్లి వెంకటలక్ష్మి(47) అనే మహిళని భోగాపురం వద్ద కారు ఢీకొని మృతి చెందింది. గత కొన్నేళ్లుగా క్రితం భర్త రమణమూర్తితో కలిసి భోగాపురంలో నివాసం ఉంటొంది. తన పెద్దకుమార్తె గాయత్రీకి మరో రెండు నెలల్లో వివాహం, పెళ్లి పనుల్లో కుటుంబసభ్యులు ఉండగా వెంకటలక్ష్మి ఈనెల 1వ తేదీ రాత్రి సర్వీసు రోడ్డు దాటుతుండగా విశాఖ వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది.

News February 3, 2026

శ్రీకాకుళం: ముగుస్తున్న సర్పంచ్‌ల పదవీ కాలం.. ఎన్నికలు జరుగుతాయా?

image

గ్రామపంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీ కాలం మరో రెండు నెలల్లో ముగుస్తుండడంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై గ్రామస్థాయిలో చర్చ మొదలైంది. ఇప్పటికే గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు ఫ్రీజింగ్‌లో ఉన్నాయి. జిల్లాలోని 912 గ్రామ పంచాయతీలు ఉండగా 2021 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. పది, ఇంటర్ పరీక్షలు, జన, కులగణన నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయా లేదా ప్రత్యేక అధికారులు వస్తారా అనే సందిగ్ధం నెలకొంది.

News February 3, 2026

రాష్ట్రంలో ఆటవిక దాడులు కొనసాగుతున్నాయి: సీదిరి

image

రాష్ట్రంలో రెడ్ బుక్ పేరిట ఆటవిక దాడులు కొనసాగుతున్నాయని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. వైయస్సార్సీపీ శ్రేణులతో కలిసి సోమవారం కాశీబుగ్గ బస్టాండ్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నిరసన తెలిపారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా అదుపు తప్పిందని ధ్వజమెత్తారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇంటి పైనా జరిగిన దాడులే ఇందుకు నిదర్శనం అన్నారు.