News July 26, 2024

ఏయూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజీనామా

image

ఆంధ్ర యూనివర్సిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి మహమ్మద్ ఖాన్ తన పదవికి రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా ఆయన విధులకు దూరంగా ఉంటున్నారు. గురువారం సాయంత్రం ఏయూ రిజిస్టార్ ‌కు తన రాజీనామా లేఖ అందించి ఆయన వెళ్లిపోయినట్లు ఏయూ వర్గాలు తెలిపాయి. మూడు సంవత్సరాల క్రితం నియమితులైన ఆయన ఏయూ భద్రత పటిష్ఠం చేయడంతో పాటు పలు వివాదాలకు కూడా కేంద్రంగా మారారు.

Similar News

News January 13, 2026

విశాఖలో వాహనదారులకు అలర్ట్

image

విశాఖలో వాయు కాలుష్యాన్ని తగ్గించే సదుద్దేశంతో ‘నో పొల్యూషన్ సర్టిఫికేట్ – నో ఫ్యూయల్‌’పై టైకూన్ జంక్షన్ నుంచి మద్దిలపాలెం వరకు ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ నెలాఖరు వరకు వాహనదారులకు దీనిపై అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత పెట్రోల్ బంకుల్లో ఇబ్బందులు రాకుండా.. జరిమానాలు పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవాలని త్రీ టౌన్ సీఐ అమ్మి నాయుడు తెలిపారు.

News January 13, 2026

వారసత్వ వ్యవసాయ భూములకు స్థిర స్టాంప్ డ్యూటీ: విశాఖ కలెక్టర్

image

పార్టిషన్ డీడ్ రిజిస్ట్రేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత సౌలభ్యం కల్పిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. వీలునామా లేకుండా వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములపై పార్టిషన్ డీడ్ నమోదు సందర్భంలో మొత్తం మార్కెట్ విలువ రూ.10 లక్షలు మించకపోతే రూ.100 స్థిర స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తామన్నారు. రూ.10 లక్షలు మించితే రూ.1000 స్థిర స్టాంప్ డ్యూటీ.

News January 13, 2026

విశాఖ: స్వపక్షంలోనే విపక్షమా..!

image

కూటమిలో కీలకంగా ఉన్నా.. తనదైన వ్యాఖ్యలతో తరచూ చర్చకు కేంద్రంగా నిలుస్తున్నారు MLA విష్ణుకుమార్ రాజు. డేటా సెంటర్ల ఉద్యోగాల అంశం, రుషికొండ భవనాల, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ విషయంలో ప్రభుత్వానికి అసౌకర్యం కలిగేలా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. కూటమిలో తగిన ప్రాధాన్యం దక్కలేదన్న భావన.. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ఆయనకు సంబంధించిన బకాయిలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో అసహనానికి గురవుతున్నారనే వాదన ఉంది.