News July 26, 2024

YVU ప్రొఫెసర్ ఎంవీ శంకర్ కు ప్రతిష్టాత్మక బ్రెయిన్ పూల్ ఫెలోషిప్

image

కడప: నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆఫ్ కొరియా 2024లో అత్యుత్తమ విదేశీ పరిశోధకులకు అందించే బ్రెయిన్ పూల్ ఫెలోషిప్ వైవీయూ మెటీరియల్స్ సైన్స్ నానోటెక్నాలజీ ప్రొ.ఎం.వి.శంకర్ కు లభించింది. దక్షిణ కొరియాలోని ప్రపంచ ర్యాంకింగ్ సంస్థ కొంకుక్ యూనివర్శిటీలో పని చేయడానికి ఈయనను ఆహ్వానించింది. ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 81 మంది సభ్యులలో ఆయన ఒకరు. వీసీ ప్రొ కె.కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ రఘునాథ రెడ్డి అభినందించారు.

Similar News

News January 16, 2025

సీఎం పర్యటనను విజయవంతం చేయండి: కడప కలెక్టర్

image

సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 18న మైదుకూరులో పర్యటించే అవకాశం ఉందని, అధికారులందరూ సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కడప కలెక్టర్ డా.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లో సీఎం పర్యటనపై సమీక్ష నిర్వహించారు. అయితే సీఎం పర్యటనకు సంబంధించి ఇంకా అధికారికంగా వివరాలు అందాల్సి ఉందన్నారు.

News January 16, 2025

కడప: ‘అధికారులు పొలాలను పరిశీలించాలి’

image

వ్యవసాయ శాఖ అధికారులు పొలాలు, రైతుల దగ్గరికి వెళ్లడం లేదని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యద ర్శి ఎన్.రవిశంకర్ రెడ్డి ఆరోపించారు. కడప నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం మాట్లాడుతూ.. రైతలు సాగు చేసిన పంటలకు సంబంధించిన సలహాలను, సూచనలను అధికారులు ఇవ్వడం లేదన్నారు. దీంతోనే పంటలు పూర్తిగా దెబ్బతిని పోతున్నాయని చెప్పారు. తక్షణమే పొలాలను పరిశీలించాలని కోరారు.

News January 16, 2025

కడప: ఇక పట్నం పోదాం..!

image

ఉమ్మడి కడప జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లిన జిల్లా వాసులు పండగ కోసం తరలి వచ్చారు. మూడు రోజులు ఎంతో ఎంజాయ్ చేశారు. నిన్న రాత్రి నుంచే పలువురు తిరిగి తమ ఉద్యోగాలకు బయల్దేరారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. రాయచోటి నేతాజీ సర్కిల్ వద్ద అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో బస్సుల కోసం ఇలా ప్రయాణికులు వేచి చూశారు.