News July 26, 2024

నెల్లూరు: గురుకులాల్లోకి ఉపాధ్యాయులు కావాలి

image

నెల్లూరు జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తాత్కాలిక పద్ధతుల నియామకానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల జిల్లా కోఆర్డినేటర్ హేమలత తెలిపారు. ఈనెల 29వ తేదీన ఉదయం 10 గంటలకు కొత్త కోడూరు గురుకుల విద్యాలయంలో డెమో ఇంగ్లిష్ లో ఇవ్వాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. అభ్యర్థులు పీజీ బీఈడీ టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలన్నారు.

Similar News

News July 9, 2025

అంతర్జాతీయ స్థాయిలో ముత్తుకూరు యువతి సత్తా

image

అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ పోటీల్లో ముత్తుకూరు మండలానికి చెందిన వి. భవాని అద్భుత ప్రతిభ కనబరిచారు. రెండు స్వర్ణ పతకాలు సాధించి రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణంగా గెలిచారు. ఈ మేరకు ఆమెను బుధవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభినందించారు. వికలాంగులు ఈ విధంగా ప్రపంచ స్థాయిలో ప్రతిభను చాటుకోవడం హర్షనీయమన్నారు.

News July 9, 2025

నెల్లూరులో స్తంభిస్తున్న ట్రాఫిక్

image

నెల్లూరు రొట్టెల పండుగకు దేశ నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. ఈక్రమంలో వాహనాల రద్దీ అధికమవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ప్రధానంగా వెంకటేశ్వరపురం బ్రిడ్జి, పొదలకూరు రోడ్డు, మినీ బైపాస్, అయ్యప్పగుడి – RTC మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ పునరుద్ధరించే చర్యలు చేపడుతున్నారు.

News July 9, 2025

నెల్లూరు రొట్టెల పండగకు 10 లక్షల మంది భక్తులు హాజరు

image

నెల్లూరు రొట్టెల పండుగకు ఇప్పటివరకు 10 లక్షల మంది భక్తులు హాజరైనట్లు జిల్లా అధికారులు అంచనా వేశారు. మంగళవారం ఒక రోజే 4 లక్షల మందికి పైగా దర్గాను దర్శించుకున్నట్లు తెలిపారు. ఎండ బాగా ఉన్నప్పటికీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. దేశ నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.