News July 26, 2024
ఒంగోలు: 34 మంది తహశీల్దార్లు రిలీవ్
సార్వత్రిక ఎన్నికల సమయంలో సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తున్న తహశీల్దార్లను మరొక జిల్లాకు ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఆ మేరకు బదిలీపై ప్రకాశం జిల్లా వచ్చిన 34 మంది తహశీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ తమిమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన తహశీల్దారులు వారి బాధ్యతలను కార్యాలయంలోని ఉప-తహసీల్దారులకు అప్పగించాలని పేర్కొన్నారు.
Similar News
News November 28, 2024
కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్.!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరో 2 కీలకమైన నిర్మాణాలు జరగనున్నాయి. స్వయంగా CM చంద్రబాబే ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో మొదటి దశ కింద ఇప్పటికే పలు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయని CM చంద్రబాబు చెప్పారు. రెండో దశ కింద వాడరేవు(చీరాల), కొత్తపట్నం(ఒంగోలు) వద్ద ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నామని ప్రకటించారు. ఇదే జరిగితే జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.
News November 27, 2024
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించిన MLA తాటిపర్తి
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విటర్(X) వేదికగా ప్రశ్నించారు. ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై విష ప్రచారం చేసి, ఇప్పుడు మా హయాంలో జరిగిన రీ సర్వే ప్రాజెక్టు గొప్పతనాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించి 500 కోట్ల రూపాయలు ప్రోత్సహకాలు తీసుకుంటుందని నిజం కాదా ?’ అని పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేశారు.
News November 27, 2024
ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్‌లో వైద్య పరీక్షలు
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హత్యాయత్నం కేసు విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిన్న రాత్రి సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని తాలుకా పోలీస్ స్టేషన్‌లోనే ఆయనను రాత్రి నుంచి ఉంచారు. అక్కడే వైద్య పరీక్షలు చేసి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించారు. గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు ఉండటంతో మరికాసేపట్లో అక్కడికి తరలిస్తారని సమాచారం.