News July 26, 2024

సమష్టిగా పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకొద్దాం: ఎస్పీ

image

సమష్టిగా పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మంచిపేరు తేవాలని ఎస్పీ కేవీ మురళీకృష్ణ అన్నారు. అనంతపురంలోని పరేడ్ మైదానంలో శుక్రవారం ఏఆర్ సాయుధ బలగాలు, హోంగార్డులు నిర్వహించిన పరేడ్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడాతూ.. పరేడ్ బాగా చేశారన్నారు. యూనిఫాం సర్వీస్‌లో ఏఆర్, హోంగార్డులు, సివిల్ పోలీసులతో పాటు ప్రాధాన్యతగా సేవలు అందిస్తున్నారన్నారు.

Similar News

News March 8, 2025

ల్యాండ్స్ సమస్యల పరిష్కారానికి చర్యలు: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా స్థాయి డాటెడ్ ల్యాండ్స్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ వినోద్ నిర్వహించారు. నిషేధిత జాబితాలో ఉన్న డాటెడ్ ల్యాండ్స్‌ని తొలగించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వస్తున్న అర్జీలు, పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతివారం షెడ్యూల్ వేసుకుని జిల్లా స్థాయి డాటెడ్ ల్యాండ్స్ కమిటీ నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.

News March 8, 2025

10 రోజుల్లోపు చార్జిషీట్ వేయాలి: అనంత కలెక్టర్

image

ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించిన కేసులపై 10 రోజుల్లోపు చార్జిషీట్ వేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో సాధారణ ఎన్నికలు- 2024 అనంతరం జరిగిన హింసపై సంబంధిత అధికారులతో జిల్లా ఎస్పీ పి. జగదీశ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల అనంతరం జరిగిన హింస చాలా సున్నితమైన అంశమన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

News March 7, 2025

షెడ్యూల్ కులాలకు సహాయం అందాలి: అనంతపురం కలెక్టర్

image

షెడ్యూల్ కులాలు, షెడ్యూలు తెగల వారికి ప్రభుత్వం నుంచి అందే సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందేలా చూడాలని, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో మినీ కాన్ఫరెన్స్ హాల్లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కాంపోనెంట్ కమిటీ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులతో నిర్వహించారు.

error: Content is protected !!