News July 26, 2024

పారిస్ ఒలింపిక్స్.. గూగుల్ స్పెషల్ డూడుల్

image

ప్రపంచంలో ఆదరణ పొందిన ఈవెంట్లను ఉద్దేశించి ఎప్పటికప్పుడూ గూగుల్ స్పెషల్ డూడుల్‌ను ప్రదర్శిస్తూ వస్తోంది. ఇవాళ పారిస్‌లో ఒలింపిక్స్ ప్రారంభం కానుండగా నదిలో ఈదుతున్న పక్షులతో కూడిన స్పెషల్ డూడుల్‌ను రూపొందించింది. చరిత్రలో తొలిసారి సెన్ నది వేదికగా ఈ ప్రారంభోత్సవం జరగనుంది. 6 కిలోమీటర్ల మేర పడవల్లో 205 దేశాల అథ్లెట్లు పరేడ్ నిర్వహిస్తారు.
<<-se>>#Olympics2024<<>>

Similar News

News April 11, 2026

స్పేస్ మిషన్‌లో ఆ 6 నిమిషాలు టెన్షన్.. టెన్షన్!

image

స్పేస్ మిషన్లలో <<19621417>>రీఎంట్రీ<<>> సమయంలో వచ్చే 6 నిమిషాల ‘బ్లాక్ అవుట్’ ఒక సహజ ప్రక్రియే. వ్యోమనౌక వేగానికి గాలి ఒత్తిడికి లోనై 2,760°C వేడి పుడుతుంది. దీంతో క్యాప్సూల్ చుట్టూ ఏర్పడే ‘ప్లాస్మా’ పొర రేడియో తరంగాలను అడ్డుకోవడం వల్ల భూమితో కమ్యూనికేషన్ కట్ అవుతుంది. దీన్నే ‘మినిట్స్ ఆఫ్ టెర్రర్’ అంటారు. వేగం తగ్గి ప్లాస్మా చల్లబడగానే సిగ్నల్ అందుతుంది. అప్పటిదాకా గ్రౌండ్ కంట్రోల్‌లో టెన్షన్ మామూలుగా ఉండదు.

News April 11, 2026

పడవ ప్రమాదం.. కఠిన నిబంధనలు తేవాలన్న సోనూసూద్

image

UP మథుర పడవ <<19620159>>ప్రమాదంలో<<>> 10 మంది ప్రాణాలు కోల్పోవడంపై నటుడు సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘గతేడాది కూడా డజన్ల కొద్దీ ఇలాంటి ప్రమాదాల్లోనే చనిపోయారు. నివారించగలిగే ఇలాంటి ప్రమాదాల్లో అమాయకులు చనిపోవడం దురదృష్టకరం. ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా లైఫ్ జాకెట్ ధరించేలా ప్రభుత్వం కఠిన నిబంధనలు తేవాలి. నిర్లక్ష్యం వీడితేనే ఇలాంటి ప్రాణనష్టాన్ని ఆపగలం’ అని X వేదికగా సూచించారు.

News April 11, 2026

వేరుశనగలో సాగుకు అనువైన అంతర పంటలు

image

వేరుశనగలో కంది, అనప, జొన్న, సజ్జ వంటివి అంతర పంటలుగా సాగుకు అనుకూలం. ఇవి పొడవైన వేరువ్యవస్థ కలిగి భూమి లోపలిపొరల నుంచి నీటిని తీసుకొని బెట్ట పరిస్థితులను సైతం తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి వేరుశనగ పంటతో పాటు నీడ, నీరు, పోషకాల విషయంలో పోటీపడవు. కంది, అనప పంటలైతే 6-7 వేరుశనగ వరుసల తర్వాత ఒక వరుసగా.. జొన్న, సజ్జ పంటలైతే 6 వేరుశనగ మొక్కల వరుసల తర్వాత 2 వరుసలుగా నాటి సాగుచేసుకోవచ్చు.