News July 26, 2024

జీరో బిల్‌తో ప్రభుత్వానికి రూ.350 కోట్ల భారం

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల విద్యుత్‌ వినియోగాన్ని ఉచితంగా ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ పథకానికి 8.50 లక్షల దరఖాస్తులు రాగా.. ఐదు లక్షల కనెక్షన్ల వరకు ప్రస్తుతం అధికారులు జీరో బిల్‌ నమోదు చేస్తున్నారు. సాంకేతిక, ఇతర కారణాలతో కొంత మందికి అర్హత ఉన్నా ఈ పథకంలో లబ్ధి చేకూరడం లేదు. ఉమ్మడి జిల్లాలో జీరో బిల్‌ నమోదు చేయడం వల్ల రూ.350 కోట్ల మేర ఆర్థిక భారం పడుతోంది.

Similar News

News January 10, 2026

నల్గొండ: నేటి నుంచి టీసీసీ పరీక్షలు

image

నల్గొండ జిల్లాలో టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. డ్రాయింగ్, టైలరింగ్ కోర్సుల కోసం జిల్లా కేంద్రంలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1550 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈనెల 13 వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో (ఉదయం 10-1, మధ్యాహ్నం 2-5) పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

News January 10, 2026

NLG: రైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి వరకు ఛాన్స్

image

సబ్సిడీపై అందించే వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు. సంక్రాంతి పండుగ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలోని రైతులు తమ పరిధిలోని వ్యవసాయ అధికారులను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2025 సంవత్సరానికి గాని పథకం అమలు కోసం ప్రభుత్వం 8 కోట్లు విడుదల చేసింది.

News January 10, 2026

క్రీడలతో పోలీసులకు ఒత్తిడి దూరం: నల్గొండ కలెక్టర్

image

నల్గొండ సమీపంలోని అన్నెపర్తి 12వ పోలీస్ బెటాలియన్‌లో 5 రోజుల పాటు నిర్వహించిన ‘ఇంటర్ కాయ్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్-2025’ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ బి.చంద్రశేఖర్ విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని అందించడమే కాకుండా, పోలీసుల విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించి నవోత్తేజాన్ని నింపుతాయని ఆయన పేర్కొన్నారు.